పవన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయనకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన ఫ్లాప్ అయిన సినిమాల కలెక్షన్స్ చెప్పకనే చెబుతాయి.
పవన్ కళ్యాణ్‌కు సాదారణ జనాల్లోనే కాకుండా సినిమా మరియు రాజకీయ రంగంలో కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఉంటున్నాడు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఎక్కువ శాతం అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.అయితే కొందరు అభిమానులు మాత్రం పవన్‌ను సినిమా పరంగానే అభిమానిస్తాం, రాజకీయంగా ఆయనకు అంత సీన్ లేదు అనేస్తున్నారు.

సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్‌కు అత్యంత పెద్ద అభిమాని ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నిర్మాత బండ్ల గణేష్ పేరు ముందు ఉంటుంది.ఈ నిర్మాత పవన్‌తో పలు చిత్రాలు నిర్మించడంతో పాటు, పవన్‌తో చాలా సన్నిహితంగా ఉంటాడు.పవన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కూడా బండ్ల గణేష్ జోక్యం చేసుకునేంతగా సన్నిహిత్యం ఉంది.పవన్‌పై ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించే బండ్ల గణేష్ ఆమద్య పవన్ జనసేన పార్టీకి జై కొట్టాడు.
ఏపీలో పవన్ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ధీమాగా చెప్పాడు.ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్‌కు బద్ద శత్రువు పార్టీ అయిన కాంగ్రెస్‌తో బండ్ల కలిసినట్లుగా అనిపిస్తుంది.
తాజాగా బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం జరిగింది.మర్యాదపూర్వకంగా రాహుల్ గాంధీని కలిసినట్లుగా బండ్ల గణేష్ చెబుతున్నప్పటికి ఏదో రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తుంది.
చాలా ఏళ్లుగా తెలంగాణలో ఉంటున్న బండ్ల గణేష్ ఫ్యామిలీ అసలు స్థానికం మాత్రం ఏపీ అనే విషయం అందరికి తెల్సిందే.ఏదైనా పోటీ చేయాలి అంటే స్థానికత తెలంగాణలో అడ్డం వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో కాంగ్రెస్‌కు ఇప్పట్లో ఛాన్స్ లేదు.ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధినేతను ఎందుకు బండ్ల గణేష్ కలిసి ఉంటాడు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
రాహుల్‌గాంధీని కలవడంతో పాటు జాతీకి కాబోయే అద్బుతమైన నేత అంటూ రాహుల్‌గాంధీని ఆకాశానికి ఎత్తేల ప్రశంసల జల్లు కురిపించాడు.ఎన్నో అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే, పవన్‌కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఇలా రాహుల్ గాంధీని కలవడం కాస్త ఆందోళనకర విషయం.
బండ్ల గణేష్‌కు కూడా పవన్‌పై మరియు పవన్ పార్టీపై నమ్మకం లేదేమో అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.
మరి ఈ సమయంలో రాహుల్‌ను బండ్ల గణేష్ కలుసుకోవడం చర్చనీయాంశం అవుతుంది.