ఐపీఎల్ ఫీవర్ అయిపొయింది అనుకున్న టైం లో పండగ లాగ మనముందు వస్తుంది “బిగ్ బాస్ – 2 “.ఇక 90 రోజులు మన ఎంటర్టైన్మెంట్ కి తిరుగు ఉండదు.
మొదటి సీజన్లో లో ఎన్టీఆర్ మన ఇంటి మనిషి లాగ ఆకట్టుకున్నాడు.ఇప్పుడు రెండో సీజన్లో నాని హోస్ట్.
ఈ సారి కొంచెం మసాలా కూడా కలిపి మనముందుకు తీసుకొని రానున్నారు.గత కొన్ని రోజుల నుండి బిగ్ బాస్ 16 మంది కాంటెస్టుల లిస్ట్ ఫేస్బుక్ లో చక్కర్లు కొడుతోంది.
శ్రీరెడ్డితో పాటుగా ఎంతోమంది పేర్లు వినపడుతున్నా అవేవి నిజమని చెప్పలేం.ఇక లేటెస్ట్ గా ఈ లిస్టులో మరో పేరు యాడ్ అయ్యింది.
ఆమె ఒక న్యూస్ రీడర్.క్లూ ఏంటి అంటే.“అవునా? నిజామా”.ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటది నేను మాట్లాడేది ఎవరి గురించో.
ప్రముఖ న్యూస్ ఛానెల్ టివి-9 న్యూస్ రీడర్, యాంకర్ దీప్తి నల్లముత్తు ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.యాంకర్ గా తన మార్క్ చూపిస్తూ ఆడియెన్స్ మెప్పు పొందుతున్న దీప్తి బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకోవడం గొప్ప విషయమని చెప్పాలి.
బిగ్ బాస్ వల్ల కత్తి మహేష్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికి తెలిసిందే.ఇక ఇప్పుడు ఈ సీజన్ లో కూడా స్ట్రాంగ్ ఐడెంటిటీ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు.దీప్తితో పాటుగా తేజశ్వి మడివాడా, సింగర్ గీతా మాధురి బిగ్ బాస్-2లో కంటెస్టంట్స్ గా కనిపిస్తారని తెలుస్తుంది.ఫైనల్ లిస్ట్ ఏంటన్నది తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈసారి గేం ప్లాన్స్, ప్రోగ్రాం కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.