పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.విద్యా సంస్థల ఒత్తిళ్లు, తల్లిదండ్రులు ఒత్తిల్లు ఇలా వివిధ రకాల కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ అబిడ్స్ లో విషాదం చోటు చేసుంది.మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ ఆత్మహత్య చేసుకుంది.
నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు చెబుతున్నారు బంధువులు.వివరాల లోకి వెళ్తే.

మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది.నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లింది.అక్కడ్నుంచి కిందకు దూకింది.బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేశారు.దూకొద్దు అని అరిచారు.దూకితే ఎలా రక్షించాలని కొందరు ఆలోచన చేస్తున్నారు.
మరికొందరు పోలీసులకు ఫోన్ చేశారు.మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.
మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది.
స్ధానికుల సమాచారం తో సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు.మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.జెస్లీస్ కౌర్ తన స్కూటీపై మయూరీ కాంప్లెక్స్‌కు వచ్చి.ఐదో అంతస్థు వరకు వెళ్లినట్లు.
సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు.కాంప్లెక్స్ పదవ అంతస్థు నుంచి యువతి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
బిల్డింగ్ చివరి అంచు వరకు వచ్చిన కౌర్.నిమిషం కూడా ఆలస్యం కాకుండా వెంటనే దూకేసింది.తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడటంతో స్పాట్ లోనే చనిపోయింది.కళ్ల ఎదుట.ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటాన్ని కొందరు వీడియోలో చిత్రీకించారు.ఇది ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ అయ్యింది.
ఇటీవల విద్యార్థులపై చదువు ఒత్తిడి బాగా పెరిగింది.విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదు.ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు శోకం మిగిల్చినవాళ్లవుతారు.మార్కులే జీవితానికి ప్రాతిపదకన కాదు.
జీవితాన్ని నడిపించేది ఆశ.ఆశ కలిగిన వ్యక్తులే ముందుకు వెళ్తారు.ఏమైనా సాధిస్తారు.







