నిఫా వైరస్ నుండి మనల్ని కాపాడేందుకు ఆ డాక్టర్ ఏం చేసారో తెలుసా.? ఈ డాక్టర్ ఏ లేకుంటే

నిఫా వైర‌స్ ప్ర‌స్తుతం ఇండియాను భ‌యాభ్రాంతుల‌కు గురిచేస్తున్న డేంజ‌ర‌స్ వైర‌స్… ఈ వైర‌స్ ఇప్ప‌టి వ‌ర‌కైతే మ‌న కంట్రోల్ లోనే ఉంది.

కానీ ఆ డాక్ట‌రే లేకుంటే….

కేర‌ళ అంత‌టికీ ఓ పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగుండేది.! అవును …క‌ర్నాట‌క‌కు చెందిన అరుణ్ కుమార్ అనే డాక్ట‌ర్ ముందుగా ఈ వైర‌స్ ను గుర్తించ‌కుండా ఉన్న‌ట్టైతే…అది క్ష‌ణాల్లోనే వ్యాపించి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉండేది.

ఏదో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణం సంభ‌వించింది అని తెలియ‌గానే…అల‌ర్ట్ అయిన అరుణ్ కుమార్ కాస్తంత అనుమానంతోనే సీన్ లోకి ఎంట‌ర‌య్యాడు.నిఫా వైర‌స్ తో పోరాడుతున్న రెండో వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కి వెళ్లిన అరుణ్ కుమార్ ….అత‌ని నుండి ఈ వైర‌స్ మ‌రింత స్ప్రెడ్ కాకుండా చూశాడు.హాస్పిట‌ల్స్ ను అల‌ర్ట్ చేశాడు.

నిఫా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే చాలు వారికి సెప‌రేట్ గా వైద్య‌సేవ‌లందించండి అని చెప్పాడు.

Advertisement

మ‌నిపాల్ సెంట‌ర్ ఫ‌ర్ వైర‌స్ రీసెర్చ్ లో HOD గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.ఈ నిఫా వైర‌స్ గురించి వివ‌రించారు.మొద‌ట కేర‌ళ‌లోని కోజికోడ్ లో ఓ వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకింది.

అతని నుండి ఆ ఇంట్లో ఉంటున్న ఇత‌రుల‌కు సోకింది…ఈ వ్య‌క్తిని హాస్పిట‌ల్ చేర్చిన క్ర‌మంలో అక్క‌డి కొంత మంది కూడా ఈ వ్యాధి బారిన ప‌డ్డారు.అని వివ‌రించారు నిఫా వ్యాప్తి గురించి అరుణ్ కుమార్.! నిఫా లాంటి ప్ర‌మాధ‌క‌ర వైర‌స్ ల‌ను ప‌రీక్షించేందుకు దేశంమొత్తం మీద రెండే ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు