‘మహానటి’పై ప్రశంసలే కాదు.. విమర్శలు కూడా

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంపై అన్ని వర్గాల వారు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్న విషయం తెల్సిందే.తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా భారీ ఎత్తున వసూళ్లు రాబడుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటఱుంది.

 Kamala About Mahanati-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ ట్రేడ్‌ వర్గాల వారిని కూడా ఆశ్చర్యంకు గురి చేస్తోంది.రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయం విశ్లేషకులు అంచనా వేస్తున్న సమయంలో మొదటి సారి ఈ చిత్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి

జెమిని గణేషన్‌ మొదటి భార్య కుమార్తె అయిన కమలా సెల్వరాజ్‌ ‘మహానటి’పై విమర్శలు చేశారు.మహానటి సావిత్రి గురించి ఈ చిత్రంలో చూపించిన విషయాల్లో చాలా తప్పులున్నాయని, తన తండ్రిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.తన తండ్రికి పెళ్లి అయిన విషయం తెలిసి కూడా సావిత్రి ప్రేమాయనం సాగించిందని, పలు సందర్బాల్లో తాను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు సావిత్రి తమ ఇంటికి వచ్చిందని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో అమ్మతో కాస్త దురుసుగా ప్రవర్తించడంతో పాటు నాన్నను ఎప్పుడు దబాయిస్తూ ఉండేదని చెప్పుకొచ్చింది.

తన తండ్రి అయిన జెమిని గణేషన్‌ మద్యంకు బానిస అయ్యి సావిత్రికి మద్యంను అవాటు చేసినట్లుగా సినిమాలో చూపించారు.

కాని అసలు విషయం ఏంటీ అంటే సావిత్రికి మొదటే మద్యం అలవాటు ఉంది.ఆ అలవాటే తన తండ్రికి వచ్చిందని, సావిత్రి వల్లే తన తండ్రి మద్యం తాగేవాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

జెమిని గణేషన్‌ కెరీర్‌ చివర్లో అవకాశాలు లేక సిగ్గుతో ఇంటికి పరిమితం అయ్యాడన్నది నిజం కాదని, ఆయన సినిమా పరిశ్రమలో ఉన్నంత కాం కూడా చాలా హుందాగా గడిపారని, ఆయనకు ఎప్పుడు కూడా అవకాశాలు రాకపోవడం లేదని, ఆయన సినిమాల కోసం నిర్మాతలు మరియు ప్రేక్షకులు ఎదురు చూసేవారు అంటూ చెప్పుకొచ్చింది

ఇక మహానటిలో తన తండ్రిని ఉమనైజర్‌గా చూపించారు.అది నిజం కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఒకానొక సమయంలో తండ్రితో కలిసి తాను సావిత్రి ఇంటికి వెళ్లాం.అప్పుడు తమపై కుక్కలను వదిలి పారిపోయేలా చేసిందని ఆమె చెప్పుకొచ్చింది.

సావిత్రికి ఈగో ఎక్కువ అని, ఆమె ఆ ఈగో వల్లే తన తండ్రికి దూరం అయ్యిందని, తానో పెద్ద స్టార్‌ను అనే అభిప్రాయం ఆమెకు ఉండేదని చెప్పుకొచ్చింది.మొత్తానికి మహానటిలో అంతా కూడా తప్పులు చూపించారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube