మంచు విష్ణు.. మైండ్‌ పనిచేయడం లేదా?

మంచు మోహన్‌బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ఇప్పటి వరకు పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయాడు.కెరీర్‌ ప్రారంభం అయ్యి దశాబ్దం దాటినా ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు పర్వాలేదు అనిపించాయి కాని మంచి కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం రాలేదు.

 Manchu Vishnu Aachari America Yatra-TeluguStop.com

అయినా కూడా ఒక ఆలోచన అంటూ లేకుండా మంచు విష్ణు సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన తెలివి తక్కువతనంను స్వయంగా నిరూపించుకుంటున్నాడు.ఒక కథను విన్నప్పుడు అందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయా, కొత్త అంశాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈయన తాజాగా చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం అత్యంత దారుణంగా ఉంది.ఒక పరమ రొటీన్‌ కథాంశం, పరమ రొటీన్‌ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.ఏమాత్రం ఆకట్టుకోని కామెడీ ప్రేక్షకులకు విసుగు కలిగించింది.మంచు విష్ణు ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటి వరకు మంచు విష్ణుకు కథల ఎంపిక విషయంలో అనుభవం రాలేదని, ఆయన కథల ఎంపిక ఏ ప్రాతిపధికన చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదని అంటున్నారు.‘దేనికైనా రెడి’ సక్సెస్‌ అయిన కారణంగానే ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రంకు ఆ దర్శకుడితో చేసేందుకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

కామెడీ ఉంటే సినిమా సక్సెస్‌ అయిపోతుందనే అభిప్రాయంలోనే మంచు విష్ణు ఉన్నాడని, ఆయన ప్రేక్షకులను ఇంకా తక్కువ దృష్టితోనే చూస్తున్నాడు అంటూ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి మంచు విష్ణు సినిమాల ఎంపిక విషయంలో దారుణంగా విఫలం అవుతున్నాడు.
కొత్త సినిమా చేయాలని, కొత్త కథలు చేయాలనే ఆలోచన ఈయనకు ఉన్నట్లుగా అనిపించడం లేదని, కమర్షియల్‌ సక్సెస్‌ కోసం మంచు విష్ణు పరితపిస్తూ ఏమాత్రం కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.త్వరలోనే మంచు విష్ణు మరో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆ చిత్రాల కథలైనా కాస్త కొత్తగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.మోహన్‌బాబు కాస్త కొడుకు సినిమాల విషయంలో దృష్టి పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube