అరటిపండు అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు.అరటిపండులో ఎన్నో పోషక విలువలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.
అలాగే ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అరటిపండులో ఉండే విటమిన్ A చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటంలో సహాయపడుతుంది.
విటమిన్ E ముడతలను తగ్గించటంలో సహాయపడుతుంది.ఇప్పుడు మెరిసే చర్మం కోసం పేస్ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
అరటిపండును గుజ్జుగా చేసి ముఖానికి పట్టించి పది నిమిషాల తరవాత శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన చర్మం అలసట లేకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
అరటిపండు గుజ్జులో తేనే కలిపి ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి వేస్తె మంచి ఫలితం కనపడుతుంది.
అరటిపండు గుజ్జులో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయటం వలన ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.