షాకింగ్ “టిడిపి” లో జగన్ నమ్మిన “బంటు”

వైసీపిలో నమ్మకమైన వాళ్ళలో ఉన్న కొంతమంది వ్యక్తులలో ఒకరు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.జగన్ కి ఎప్పుడు సన్నిహితంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి ఆ మధ్య వైసీపిని వీడుతున్నారు అంటూ వస్తున్న వ్యాఖ్యలలో నిజానిజాలు ఎలా ఉన్నా ఆ మధ్య మాత్రం శ్రీకాంత్ రెడ్డి టిడిపి లోకి చేరిపోయారని ఒక సారి రేపే ముహూర్తం అని మరొకసారి ఇలా మొత్తానికి ఆ వార్తా హల్చల్ చేసింది.

 Ysrcp Mla Srikanth Reddy To Join Tdp-TeluguStop.com

అయితే ఈ సారి మాత్రం ఆ వార్తా నిజం కాబోతోందని కడపకు చెందిన టిడిపి నాయకులు అంటున్నారు.అతి త్వరలో రాయచోటి ఎమ్మెల్యే ‘శ్రీకాంత్‌రెడ్డి’ టిడిపిలో చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.

‘జగన్‌’కు చిన్ననాటి స్నేహితుడు అయిన ‘శ్రీకాంత్‌రెడ్డి’ రాజకీయంగా ‘జగన్‌’కు అత్యంత సన్నిహితుడు.అంతేకాదు జిల్లాలో సైతం శ్రీకాంత్ రెడ్డి కి ఎంతో మంచి పేరు ఉంది.

ఎంతో మంచి నేతగా పేరు ఉన్న శ్రీకాంత్ రెడ్డి .గత కొన్నాళ్లుగా ఆయన వైకాపాలో ఇమడలేని పరిస్థితి ఉందని.శ్రీకాంత్ రెడ్డి కి ఈ సారి టిక్కెట్టు ఇవ్వకుండా వైకాపాలో కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది… అయితే ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి ఎన్ని సార్లు జగన్ కి చెప్పినా సరే పెడచెవిన పెట్టాడని.ఈ విషయంలో సరైన క్లారిటీ లేకుండా చెప్పుడు మాటలు వింటున్నారు అనేది శ్రీకాంత్ రెడ్డి వాదన.

ఇదిలాఉంటే…శ్రీకాంత్‌రెడ్డి పార్టీ వీడిపోతే…’జగన్‌’ కి కడపలో కోలుకోలేని షాక్ తగిలినట్టే.గత ఎన్నికల్లో మొత్తం పది స్థానాలకు గానూ…తొమ్మిది స్థానాలు సాధించి తిరుగులేని మెజార్టీ సాధించిన ఆ పార్టీ…ఇప్పుడు ఒక వేళ శ్రీకాంత్ రెడ్డి గనుకా పార్టీ మారినట్టైతే గతంలో వచ్చినట్లుగా అన్ని సీట్లు రావడం కష్టం అని చెప్పవచ్చు.

తపకుండా శ్రీకాంత్ రెడ్డి ఎఫెక్ట్ జగన్ పై పడుతుంది కడప రాజకీయాలో తీవ్రమైన ప్రభావం చూపుతుందని అంటున్నారు.అంతేకాదు ఆయన బాటలోనే మరి కొందరు వెళ్ళే అవకాసం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది…అయితే విజయసాయి రెడ్డి చేస్తున్న రాజకీయాల వల్లనే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీని వీడనున్నారని తెలుస్తోంది… మొత్తం మీద.జగన్ సొంత జిల్లాలో విజయసాయి వలన కీలక మైన వ్యక్తిని జగన్ కోల్పోతున్నాడని అంటున్నారు.విశ్లేషకులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube