వేసవి కాలం వచ్చేసింది.ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగలటం,అలసట,నిస్సత్తువ వంటివి వస్తాయి.
అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఒకప్పుడు శరీరంలో వేడి చేసినదని అనిపించినప్పుడు సబ్జా గింజలను నానబెట్టుకుని పంచదార కలుపుకొని త్రాగేవారు.
ఈ పానీయాన్ని ఉదయం త్రాగితే మంచిదని ఆయుర్వేదం చెప్పుతుంది.ప్రతి రోజు సబ్జా పానీయం త్రాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
సబ్జా గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం, ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు మన శరీరానికి బాగా అందుతాయి.
ప్రతి రోజు సబ్జా పానీయాన్ని త్రాగటం వలన శరీరంలో ద్రవాల స్థిరీకరణ జరుగుతుంది.
సబ్జా గింజల పానీయాన్ని ప్రతి రోజు త్రాగితే వేసవి కాలం ఎండ తీవ్రత మన మీద ఉండదు.
సబ్జా గింజల పానీయంలో పంచదార వేయకుండా త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గి మధుమేహం అదుపులోకి వస్తుంది.
జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
శరీరంలో వ్యర్ధాలు బయటకు పోయి రక్తం శుద్ధి అవుతుంది.
సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, పంచదార వేసి తాగితే అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు.
రోజంతా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను రాత్రి పూట పానీయం రూపంలో తాగితే అధిక బరువు తగ్గుతారు.
ఈ పానీయం సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేసి అనేక రకాల ఇన్ఫెక్షన్లను తరిమి కొడుతోంది.
గోరువెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులు తగ్గుతాయి.