టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ మొన్నటి వరకూ కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పిన వారు ఎవరు లేరు అనేది అందరికీ తెలిసిన వాస్తవం.ఏపీ టిడిపిలో ఎంత క్రమశిక్షణ ఉంటుందో టీఆర్ఎస్ పార్టీలో అంతకంటే ఎక్కువగా క్రమశిక్షణ ఉంటుదని అంటారు అందరు.
అయితే ఇప్పుడు ఆ కేసీఆర్ మార్క్ క్రమశిక్షణ గాడి తప్పింది అంటున్నారు.దానికి నిదర్సనంగా ప్రభుత్వ హోం మినిస్టర్ అయిన నాయిని.
తెలంగాణా ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసిన శ్రీనివాస్ గౌడ్ ల భహిరంగ విమర్శలే.
అయితే కేసీఆర్ కు ఎంతో నమ్మకంగా ఉండే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి నుంచి ఇలాంటి అసంతృప్తి వ్యక్తం కావడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు కేసీఆర్ ను, తెలంగాణ ఉద్యమాన్ని తిట్టిన వాళ్లకే ఇప్పుడు ప్రాధాన్యత ఉందని నాయిని బండ బూతులతో చెప్పడం.అవును నాయిని చెప్పింది నిజమే అని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలపడంపై ఇప్పుడు టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.
అయితే నాయిని వ్యాఖ్యలకి మాత్రం ఓ మర్మం దాగి ఉంది అని తెలుస్తోంది.వచ్చే మంత్రి వర్గ విస్తరణలో నాయినిని పక్కన పెట్టి ఉమా మాధవరెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.
ఈ విషయమే నాయినికి చూచాయిగా తెలిపడం వలన ఇలా మాట్లాడారని కొందరు చర్చించుకుంటున్నారు.తెలంగాణ ఉద్యమం చేయాని వాళ్ళకి పదవులు ఇస్తున్నారు…ఉద్యమంలో లేని వారికి పదవులు ఇస్తున్నారు అంటూ ఇప్పటికే ఉద్యమనేతలు శ్రీనివాస్ గౌడ్ వంటి నేతల్లో కనిపిస్తోంది.
ఈ కారణంగానే ఆయన నాయినిని శ్రీనివాస్ గౌడ్ వెనకేసుకోచ్చినట్టుగా చెప్తున్నారు…ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతలు కేసీఆర్ పై తిరిగిబావుటా ఎగరవేయడం చూస్తుంటే.ఈ వ్యాఖ్యలు కేసీఆర్ పై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనే విషయం ఆసక్తికరంగా మారింది…నాయిని ఎంతో వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఈ దెబ్బతో తన మంత్రి పదవికి వచ్చే గండం ఏమి లేదనేది విశ్లేషకుల అభిప్రాయం…మరి నాయినిని కట్టడి చేయడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో వేచి చూడాలి.