తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ప్రతి రోజు ఒక తమలపాకును తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
తమలపాకులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్.సి.విటమిన్ లు సమృద్ధిగా ఉన్నాయి.మన పూర్వీకులు తమలపాకును ఎక్కువగా ఉపయోగించేవారు.
తమలపాకు తినటం వలన జీర్ణక్రియ మెరుగు పరచటంలో సహాయపడుతుంది.తమలపాకులో ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన ప్రతి రోజు ఒక తమలపాకు తింటే జీర్ణక్రియ సమస్యల నుండి బయటపడవచ్చు.
తమలపాకును మెత్తని పేస్ట్ చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది.అలాగే తలలో వేడిని కూడా తగ్గిస్తుంది.మీ ఎముకలు బలంగా ఉండాలన్నా, కీళ్ల నొప్పులు,నడుము నొప్పులు తగ్గాలంటే ఈ విధంగా చేయాలి.తమలపాకు మీద సున్నం రాసి తినాలి.
ఈ విధంగా ప్రతి రోజు తినటం వలన ఎముకలు బలంగా మారటమే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే సున్నాన్ని చిటికెడు మాత్రమే వాడాలి.
సున్నంలో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు బలంగా మారటానికి సహాయపడుతుంది.
ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా అధిక బరువు,అధిక పొట్ట సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.
అధిక బరువు తగ్గి సన్నగా మారాలంటే ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక తమలపాకులో రెండు మూడు మిరియాల గింజలను పెట్టుకొని తినాలి.ఈ విధంగా చేయటం వలన శరీరంలో కొవ్వు కరిగి సన్నగా మారతారు.
ఈ విధంగా రెండు నెలల పాటు చేస్తే మీ బరువులో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.
తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మంపై వృద్దాప్య ఛాయలు తొందరగా రాకుండా కాపాడుతుంది.
అంతేకాక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఏమైనా గాయాలు అయినప్పుడు తమలపాకును పేస్ట్ గా చేసి ఆ గాయాలకు కట్టు కడితే తొందరగా నయం అవుతాయి.
కడుపులో ఉన్న నులి పురుగులను తొలగించుకోవడానికి ఇలా చేయాలి.ఒక తమలపాకు, ఐదు తులసి ఆకులు, ఒక స్పూన్ వాము, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోని మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ నుంచి రసాన్ని తీయాలి.ఈ రసాన్ని ఉదయం పరగడుపున త్రాగితే నులి పురుగులు మరియు శరీరంలో విషాలు తొలగిపోతాయి.