ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం.అపర చానిక్యుడిగా పేరు.
ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్న ఏపీ సీఎం ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఎటువంటి అడుగు వేయాలో తెలియక సతమత మావుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలా లేక పొత్తు పెట్టుకుని వెళ్ళాలా అనే డైలామాలో బాబు ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరనాలు మార్చుకోవలసిన అవసరం తప్పకుండ ఏర్పడుతోంది.ఇది ప్రతీ పార్టీకి తప్పని పరిస్థితి.
మరి ఈ సమయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది బాబు ఆలోచన.గత ఎన్నికల్లో కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్ట్టుకుంది.
అదీ కాకుండా పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసి విజయానికి దోహదం చేసాడు.అయినా ఆ ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లను మాత్రమే అదనంగా పొందారు.
ఇప్పుడు జనసేన అధ్యక్షుడు దూకుడు పెంచాడు.పవన్ ఓటరి పోరు చేస్తాడా లేక పొత్తు పెట్టుకుంటాడా అంటే తెలియని విషయం.బీజేపీతో పొత్తును వదులుకోవడానికి.పవన్ తో స్నేహం వదులుకోవడానికి బాబు సిద్దంగా లేరు అందుకే ఏపీ బిజేపి నేతలు ఎంతగా బాబు ని టార్గెట్ చేస్తున్న సరే మిన్నకుండి పోయారు అంటే కారణం అదే.
దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు బాబు బీజేపీ.పవన్ తో పొత్తు కోసమే బాబు ఇంకా ఆరాటపడుతున్నాడు అని.అయితే బిజేపి వైఖరి చూస్తుంటే బాబు తో కలిసి వెళ్ళడానికి సిద్దంగా లేరు అన్నట్టుగానే ఉంది అయితే సోము అధిష్టానం చెప్పకుండా టిడిపి పై మాటల దాడి చేయడు కదా మరి బాబు పై వ్యాఖ్యల వెనుకాల అధిష్టానం అనుమతి ఉంటే చంద్రబాబు ఆశలు ఆవిరి అయ్యినట్టే కదా.ఇదిలా ఉంటే
చంద్రబాబు మాత్రం మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణిలో ఉండి అప్పుడు పొత్తుల ఒక నిర్ణయానికి వస్తే మంచిది అని భావిస్తున్నారట.అయినా ఎన్నికలు మరో సంవత్సరం ఉన్నాయి అప్పుడు చూద్దాం అని అంటున్నారట బాబు.అయితే విశ్లేషకులు మాత్రం బాబు ఈ సారి ధైర్యంగా అడుగు వేయలేకపోతున్నారు అని అంటున్నారు.
రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు చుసిన బాబు వచ్చే ఎన్నికల విషయంలో ఎంతో అంతర్మధనం పడుతున్నారని అంటున్నారు.మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి కొన్ని రోజుల్లో తేలుతుంది అంటున్నారు టిడిపి నాయకులు.