గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే వచ్చాయి.ఫలితాలు ఉదయం నుంచీ ఊగిసలాడుతూ వచ్చినా సరే చివరికి బీజేపీని ఆధిక్యంలో నిలబెట్టాయి.
అయితే కాంగ్రెస్ ఏమి తక్కువ తినలేదు ఎన్నడు లేనంతగా బిజేపికి గట్టి పోటీని ఇచ్చింది కాంగ్రెస్ ఉదయం నుంచీ నువ్వా నేనా అంటూ సాగిన పోటీ ఉన్నట్టుండి బిజెపికి అనుకూలంగా మారిపోయింది.ఒక సమయంలో అయితే ముఖ్యమంత్రి విజయ్ రూపాని వెనుకబడ్డారు కూడా.
ఇదిలా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బిజెపికి చుక్కలు చూపించింది అని చెప్పాలి.పది గంటలసమయంలో బీజేపీ 103 స్థానాల్లో.కాంగ్రెస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.గతంలో కంటే బీజేపీకి పదిహేను సీట్లు తగ్గే అవకాశాలు ఉండగా.
కాంగ్రెస్ పార్టీకి పదిహేనుకు పైగా సీట్లు పెరిగేలా చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 110 నుంచి 120 స్థానాల మధ్య గెలుస్తుందని,.కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 80 మధ్య సీట్లు వస్తాయని చెప్పాయి.
అయితే ఈ విశ్లేషణ నిజం అయ్యేలానే అనిపించింది.అయితే ఈ గెలుపు బీజేపీకి సరైన గెలుపు కాదని అంటున్నారు విశ్లేషకులు.
అధికార పార్టీ.అందులోనూ గొప్ప నాయకుడిగా చెప్పుకుంటున్న మోడీ ఇలాఖా.మరి ఎంత బలం ఉంటుంది.దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ఎన్నికల గురించి ప్రధాని, ముఖ్యమంత్రి.
పక్క రాష్ట్రాల మంత్రులు అందరు కలిసి వచ్చి చెమటలు చిందించి పోరాడారు…ఈ సారి గుజరాత్ గెలుపు అంత సులభం కాదు అని ముందే బిజెపి కి అర్థం అయ్యింది అంటున్నారు.కానీ కాంగ్రెస్ ఇంట గట్టి పోటీ ఇస్తుంది అని ఎవరు ఊహించి ఉండరు.
గుజరాత్‌లో గెలుపు ప్రధాని నరేంద్ర మోడీకి.బీజేపీకి ఓ గెలుపు కాదని విపక్షాలు అంటున్నాయి.
అయితే ఈ సారి గుజరాత్ లో హోరా హోరీగా పోరు జరగడానికి పటేళ్ళ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ముఖ్య కారణం అని హార్దిక్ ఎఫెక్ట్ మోడీ కి బాగా తగిలింది అంటున్నారు విశ్లేషకులు.అయితే ఈ ఎన్నికల రిజల్ట్స్ చూసి అయినా సరే మోడీ తీరు మార్చుకోవడం మంచిది అంటున్నారు.







