కొన్ని ఆహార పదార్దాలను పోషకాహారంగా భావించి ఎక్కువగా తీసుకుంటాం.అయితే అవి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందనే వార్తలు వింటూ ఉంటాం.
దీంతో అసలు ఆ ఆహారం తీసుకోవాలా వద్దా అనే మీమాంస వచ్చి కొంత అయోమయానికి గురి అవుతాము.అందువల్ల ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
గుడ్డుసంపూర్ణ ఆహారంగా పేరు పొందిన దీన్ని తీసుకుంటే బరువు పెరుగుతామని చాలా మందిలో అపోహ ఉంది.కానీ ఇది చాలా తప్పు.గుడ్డు తినటం వలన ఆకలి తగ్గి సంతృప్తిగా ఉంచటానికి దోహదం చేస్తుంది.అంతేకాక బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.
దీనిలో ఉండే ప్రత్యేకమైన యాంటి ఆక్సి డెంట్స్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
తక్కువ పరిమాణంలో ఎక్కువ భోజనంతక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు భోజనం చేయటం మంచిదనే విషయాన్నీ చాలా మంది నమ్ముతారు.
అయితే అది శాస్త్రీయంగా రుజువు కాలేదని నిపుణులు అంటున్నారు.తక్కువ భోజనం తినటం వలన శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.
సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా అధిక బరువును తగ్గించుకోవాలే తప్ప ఆకలిని నియంత్రించి సాదించకూడదని నిపుణులు అంటున్నారు.
చక్కెరలో క్యాలరీలుచక్కెరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయని అందరూ భావిస్తారు.
కానీ అది నిజం కాదు.చక్కేరలోని క్యాలరీలు హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.
చక్కర అధికంగా తీసుకోవటం వలన జీవక్రియ మీద ప్రభావం చూపుతుంది.