జనసేనలోకి క్యూ కట్టనున్న వైసీపి ఎమ్మెల్యేలు

ఉన్నట్టుండి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.ఒక వైపు వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయత్రని మొదలుపెట్టాడో లేదో టిడిపి మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.

 Ycp Mla’s Looking Into Janasena Party-TeluguStop.com

తూగో జిల్లా నుంచీ రంపచోడవరం ఎమ్మెల్యేని టిడిపిలోకి కండువా కప్పి మరీ ఆహ్వానించారు బాబు.అయితే వైసీపి నుంచీ బయటకి రావాలని అనుకున్న వాళ్ళలో చాలా మందికి టిడిపి లోకి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో జనసేనలోకి తొంగి చూస్తున్నారు అని తెలుస్తోంది

తాజాగా సింహపురి నుంచి ఒక వైసీపీ ఎమ్యెల్యే జనసేన వైపు చూస్తున్నట్లుగా సమాచారం.

సదరు ఎమ్యెల్యే ఈ మేరకు పవన్ ను కలిసి జనసేనలోకి రావడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు అని టాక్.వైసీపికి నెల్లూరులో మాంచి పట్టు ఉంది.

గత ఎన్నికల్లో అక్కడ ఉన్న పది అసెంబ్లీ స్థానాలకి గాను సుమారు ఏడు స్థానాలని వైసీపి గెలుచుకుంది.దీంతో నెల్లూరు వైసీపికి కంచుకోటలా మారింది.

అయితే ఇప్పుడు ఆకోటకి బీటలు వారుతున్నాయి.రెండు ఏళ్లకిందట గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ రెడ్డి సైకిల్ ఎక్కేశారు

ఇప్పుడు తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఇటీవల పలుమార్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని కలిశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ ఎమ్మెల్యేకి జనసేనలోకి రావాలంటే వైసీపిలో రాజీనామా చేసిన తరవాతే జనసేనలోకి రమ్మన్నారని టాక్.ఇప్పుడు ఈ విషయం నెల్లూరు అంతా వ్యాపిస్తోంది.

ఐతే సదరు ఎమ్మెల్యే చిరంజీవికి వీరాభిమాని కావడం తో .పవన్ ని మర్యాద పూర్వకంగా కలిసాను.అంతకు మించి మరేమీ లేదు అని చెప్పారట.అయితే పక్క పార్టీలో ఉన్న నేతలని ఆహ్వానిస్తే మరి జనసేనలోకి కొత్త రక్తం ఎక్కడ నుంచీ వస్తుంది.ప్రజలలో జనసేన మీద నమ్మకం కలుగుతుందా అనే విషయాలు కూడా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.నిజంగానే పవన్ వలసలని ప్రోశ్చహిస్తే చాలా మంది నాయకులు జనసేనలోకి దూకేయడానికి సిద్దంగా ఉన్నారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube