జనసేన ఇంకా జనంలోకి పూర్తీ స్థాయిలో రాలేదు కానీ అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ పూర్తీ స్థాయి రాజకీయాల్లోకి వస్తారని చెప్తున్నారు ఆ పార్టీ వర్గాలు.ఇప్పటి వరకు పార్టీమీద నమ్మకం కూస్తో కాస్తో ఉందంటే అది కేవలం అప్పుడప్పుడు పవన్ ప్రజా సమస్యలపై మాట్లాడటం వల్లనే.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తోన్న పవన్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రజల్లోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంద లేదా.
ఏదన్నా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్నదానిపై అయితే ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది
పవన్ పార్టీ ఏపీ, తెలంగాణలో కలిపి 175 సీట్లలో పోటీ చేస్తుందని జనసేన నుంచే ప్రకటన వచ్చింది.
జనసేన కి బలమైన చోట్ల మాత్రమే పోటీ పెట్టాలని భావిస్తోంది.గతంలో చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లలో పోటీ చేసి చాలా సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
ఇప్పుడు తన పరిస్థితి అలా ఉండకూడదు అని భావిస్తున్నాడట పవన్.
ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.
ఏపీ, తెలంగాణలో జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయన్న చర్చలు వస్తున్నాయి.ఏపీలో జనసేనకు టీడీపీ 30 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు ఇస్తుందట.
అంతేకాదు పవన్ కొంతమంది సినిమా వాళ్ళకి కూడా టికెట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.టాలీవుడ్ నుంచి ఐదుగురు ప్రముఖులకు పవన్ కళ్యాణ్ జనసేన తరుపున టికెట్లు ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి
పవన్ కు సన్నిహితంగా మెలిగే హాస్య నటుడు అలీకి రాజమండ్రి లేకపోతే గుంటూరు ఈస్ట్ సీటు ఇస్తారని తెలుస్తోంది.
అంతేకాదు గతంలో బిజేపి కండువా కప్పుకుని తరువాత బిజెపి నుంచీ బయటకి వచ్చిన హీరో శివాజీ కూడా జనసేనలోకి వెళ్ళే చాన్స్ ఉందని తెలుస్తోంది.ఆయను గుంటూరు జిల్లా నరసారావుపేట సీటు ఇవ్వొచ్చని సమాచారం.
మతాల మాంత్రికుడు.దర్శకుడు త్రివిక్రమ్‌ను పార్టీ లో వెనకనుంచీ నడిపించాలని.
కోరినట్టుగా తెలిస్తోంది.ఒక వేళ నాగబాబు కనుకా రంగంలోకి దిగితే అన్నయ్యకి.
కాకినాడ నుంచి ఎంపీగా లేదా తూర్పుగోదావరి జిల్లా లేదా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లేదా పాలకొల్లు నుంచి ఎంపీగా అయినా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది.వీరు మాత్రమే కాకుండా ఇంకా మరో నలుగు ఐదుగురు వరకు లిస్టు లో ఉన్నారని సమాచారం మరి.చివరివరకు ఈ పేర్లు వినిపిస్తాయ లేక వేరే వ్యక్తులకి అవకాసం ఇస్తాడ అనేది వేచి చూడాలి.