రాజకీయాల్లో ఎప్పుడూ ఏమి జరుగుతుందో చెప్పలేము.ఎవరి పొజిషన్ ఏమిటో .
ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు.మాకు తిరుగేలేదు అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవచ్చు.
ఇప్పుడు ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పరిస్థితి కూడా అలాగే ఉంది.ఆయన పనితీరు మీద చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొదట్నుంచి బాబుకి కుడి భుజంగా ఉంటున్న యనమల పార్టీలో సీనియర్.అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖను కూడా అప్పచెప్పారు.
అయితే ఆ శాఖకు సరైన రీతిలో యనమల న్యాయం చెయ్యడం లేదు.దీంతో చేసేదిలేక త్వరలోనే ఆయనను ఈపదవి నుంచి తప్పించి అసలు ఏపీలోనే లేకుండా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది
సీఎం నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట.
దీనిని అదుపులో పెట్టేందుకు కానీ, విభజన చట్టం మేరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కానీ, ఓ ఆర్థిక మంత్రిగా యనమల చేసిన, చేస్తున్న ప్రయత్నం బాబుకు ఎక్కడా కనిపించడం లేదు.అదేసమయంలో కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతగల కుండా చూడడంలోనూ యనమల విఫలమయ్యారని బాబు భావిస్తున్నారు.
జీఎస్టీ నుంచి టీటీడీని తప్పించలేకపోయారని, అదేవిధంగా ప్రతి విషయానికీ తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడంపైనా బాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఉన్నంత చురుగ్గా ‘యనమల’పనిచేయటం లేదని చంద్రబాబు అంటున్నారట.
అంతే కాకుండా తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కూడా యనమల వైఖరి వివాదాస్పదం అవుతోంది.ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న బాబు మొహమాటానికి పోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన బాబు ఆ శాఖ నుంచి తప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయన స్థానంలో ఎవర్ని నియమిస్తారని విషయం ఇంకా తెలియరాలేదు.