నంద్యాల‌లో టీడీపీ-వైసీపీ స‌ర్వేలు ఏం చెపుతున్నాయ్‌

నంద్యాల‌లో టీడీపీ విజ‌యం గ్యారెంటీ అని ఒక స‌ర్వే.నంద్యాల‌లో వైసీపీకి అంత మెజారిటీ వ‌స్తుంద‌ని మ‌రో స‌ర్వే.

 Tdp And Ysrcp Survey On Nandyal By Election-TeluguStop.com

ఇలా స‌ర్వేలమీద స‌ర్వేలు!! నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే అంశంపై స‌ర్వేలు, బెట్టింగులు జోరందు కున్నాయి.ఈ ఫ‌లితాల‌పై ప్ర‌జ‌ల మాట ఎలా ఉన్నా.

అవి స‌శాస్త్రీయ‌మా లేదా అనేది తెలియ‌ని అంశ‌మే! మ‌రి ఇన్ని స‌ర్వేలు బ‌య‌టికి వ‌స్తున్నా.టీడీపీ, వైసీపీ సొంత స‌ర్వేల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయి.

ఎలాంటి రిజ‌ల్ట్‌ను అధిష్ఠానానికి పంపించాయి అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.మ‌రి ఈఎన్నిక‌ల ఫ‌లితాల‌పై రెండు పార్టీల నేత‌లు నిర్వ‌హించిన స‌ర్వేలు ఏంచెబుతున్నాయంటే.

నంద్యాల‌లో ప్ర‌చార ప‌ర్వానికి ఇక ముగింపు ప‌డ‌బోతోంది.ప్ర‌చారం మ‌రింత హీటెక్కించ‌నుంది.

మరి ఓట‌రు ఎవ‌రిపై ద‌య చూపిస్తాడ‌నేది ప‌సిగ‌ట్ట‌లేని అంశ‌మే! అయితే నంద్యాల ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో వైకాపా, టీడీపీలు యథావిధి స‌ర్వేలు చేయించుకున్న‌ట్టు స‌మాచారం.ఇందులోనూ త‌మ అభ్య‌ర్థులే గెలిచే ప‌రిస్థితి ఉందంటూ ఫ‌లితాలు కామ‌న్‌గా వ‌చ్చాయి.

అయితే, మెజారిటీ విష‌యంలో రెండు స‌ర్వేలూ దాదాపు ఒకే సంఖ్య బ‌య‌ట‌పెట్ట‌డం విచిత్రం! నంద్యాల‌లో తాజాగా వైకాపా ఓ స‌ర్వే చేయించుకుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.దీని ప్ర‌కారం వైకాపా అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి గెలుపు ఖాయ‌మ‌నీ, 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తార‌ని తేలింద‌ట‌!

ఇక‌, టీడీపీ స‌ర్వే ప్ర‌కారం ఆ పార్టీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి గెలుస్తార‌నీ, 15 నుంచి 18 వేల ఓట్లు మెజారిటీ వ‌స్తుంద‌ని తేలింద‌ట‌.

ఈ నివేదిక‌ను మంత్రి భూమా అఖిల ప్రియ సీఎం చంద్ర‌బాబుకు పంపించార‌ని స‌మాచారం.అయితే ఇంత త‌క్కువ మెజారిటీ స‌రిపోద‌ని, దీనిని ఇంకా పెంచే దిశ‌గా పార్టీ శ్రేణులు క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న సూచించార‌ట‌.

భూమా అఖిల ప్రియ తాజా ప్ర‌సంగాల్లో వినిపించే ధీమాకు ఈ స‌ర్వే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.తాను ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థి గెలుపు గురించి ఆలోచించ‌డం లేద‌నీ, ఎంత మెజారిటీ సాధిస్తామ‌నే దాని గురించే ఆలోచిస్తున్నాన‌ని తాజాగా అఖిల ప్రియ చెబుతున్నారు.

ఈ ఆత్మ విశ్వాసానికి కార‌ణం స‌ర్వే ఫ‌లిత‌మే అని చెబుతున్నారు.

వైకాపా విష‌యానికొస్తే.

కొన్నేళ్లుగా జ‌గ‌న్ కు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్న ఓ ప్ర‌ముఖ సంస్థ.ఇప్పుడు కూడా స‌ర్వే చేసింద‌ట‌.

ఇందులో శిల్పా గెలుపు ఖాయ‌మ‌ని చెబుతూనే మెజారిటీ 15 వేల ఓట్ల‌కు మించి ఉండ‌ద‌ని ఆ సంస్థ తేల్చిందని అంటున్నారు.దీంతో నంద్యాల వైకాపా వ‌ర్గాల్లో కొంత ఆందోళన చెందుతున్న‌ట్టు స‌మాచారం.

ఎన్నిక‌ల‌కు ముందు ఈ మాత్రం మెజారిటీ అంటే… ఎన్నిక‌లు జ‌రిగే నాటికి ప‌రిస్థితి మారే అవ‌కాశం ఉంటుందని జ‌గ‌న్ చెప్పార‌ట, అంతేగాక పార్టీ శ్రేణులు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా సూచించార‌ట‌.మొత్తానికి మొన్న‌టివ‌రకూ విజ‌యం సాధిస్తే చాలు అని చెప్పిన నేత‌లు.

ఇప్పుడు మెజారిటీ భారీగా రావాల‌ని కోరుకుంటున్నార‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube