డైలీ సీరియల్ లో 9 ఏళ్ల అబ్బాయితో 18 ఏళ్ల అమ్మాయి ఫస్ట్ నైట్

దేశం అన్ని రంగాల్లో బాగుపడుతోంది కాని టీవి సీరియళ్ళ విషయంలో మాత్రం రోజురోజుకి దరిద్రమైన స్థాయికి దిగజారిపోతున్నాం.ఒక్కటంటే ఒక్క సీరియల్లో అయినా మంచి కథ, అర్థవంతమైన సన్నివేశాలు ఉంటున్నాయా? సినిమాలు వేరు, సీరియల్స్ వేరు.సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాలి.ఇష్టం ఉన్నవారు చూస్తారు, ఇష్టం లేని వారు వదిలేస్తారు.సినిమాలో ఉన్న కంటెంట్ ని బట్టే వాటికి A, U/A మరియు U లాంటి సర్టిఫికేట్స్ పెట్టారు.సినిమా క్యాటగిరిని బట్టి దీన్ని ఏ వయసు వారు చూడాలో, ఇంటిల్లిపాది చూడాలో లేదో అర్థమైపోతుంది.

 9 Year Old Boy Romances 18 Year Old Girl In Hindi Tv Serial-TeluguStop.com

మరి టీవిలో? ఇలాంటి సర్టిఫికేట్స్ లేవుగా.పైగా ఇంట్లో చూడాలి.

అలాంటి సీరియల్స్ ని లాజిక్ లేని కథలతో, పైత్యంతో నింపేస్తున్నారు.ఎంతకాలమైందో టీవిలో ఒక సహజమైన కథ చూసి.

ఇలాంటి ట్రెండ్ లో మరో వెర్రి సీరియల్ వస్తోంది.ఆ హిందీ సీరియల్ పేరు “పెహ్రేదార్ పియా కి”.

ఇందులో హీరో వయసు 9 ఏళ్ళు, హీరోయిన్ వయసు 18.షాక్ అవకండి అప్పుడే.అసలు షాక్ ఇప్పుడు ఇస్తున్నాం.ఈ సీరియల్ ప్రోమోలో హీరో హీరోయిన్ వెంటపడుతుంటాడు.సరసాలు ఆడుతుంటాడు, తనకి బొట్టు పెడతాడు, పైత్యం పీక్స్ చేరి ఫస్ట్ నైట్ కూడా చేస్తాడు.అవును, తొమ్మిదేళ్ళ పిల్లాడు, తనకన్నా వయసులో డబుల్ పెద్దది అయిన అమ్మాయితో ఇవన్ని చేస్తూ ఉంటాడు.

ఈ ప్రోమో, ఈ సీరియల్ ఫ్యామిలి మొత్తం కలిసి కూర్చునే టైమ్ లోనే సోని లాంటి పెద్ద ఛానెల్ లో వస్తోంది.

-Latest News Englishవెంటనే కొందరు సామాజిక కార్యకర్తలు ఈ సీరియల్ ని బ్యాన్ చేయాలని పిటిషన్ వేసారు.దీనికి స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని వెంటనే ఈ సీరియల్ మీద, మేకర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని Broadcasting Content Complaints Council (BCCC) కి లేఖ రాసారు.

ఏ వివాదంపై స్పందించిన హీరోయిన్ తేజస్వి ప్రకాష్ “ఈ పీటిషణ్ ద్వారా ఏం జరుగుతుంది అనే విషయం గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు.

మేము బాల్య వివాహాన్ని ప్రమోట్ చేయడం లేదు.సీరియల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు.ఇది ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో నాకు అర్థం కావడం లేదు.నిజ జీవితంలో 18 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడే, లేదా పెళ్ళి చేసుకునే 9 ఏళ్ల పిల్లాడిని చూపించగలరా?” అంటూ వెరైటి వాదన చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube