ఏ ముహూర్తాన మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా ఒప్పుకున్నాడో కాని, సంవత్సరం గడుస్తున్నా, ఆ సినిమా ఇంకా మహేష్ ని, మహేష్ అభిమానుల్ని గాయపరుస్తూనే ఉంది.మహేష్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా అనే బిరుదుని పొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కూడా మహేష్ కెరీర్లోనే అత్యంత బలహీనమైన సినిమాగా నిలిచి 35 కోట్ల దాకా నష్టాల్ని మూటగట్టుకుంది.
ఇదంతా జరిగి ఇన్ని నెలలు అవుతున్నా, బ్రహ్మోత్సవం నష్టాల జాబితా ఇంకా పూర్తవలేదు.ఇంకా కోట్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి.
కాని ఈసారి నిర్మాతలకి, పంపిణీదారులకి కాదు.
బ్రహ్మోత్సవం మూలాన తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది అంటా జీ తెలుగు.
ఈ ఛానేలే కదా, పదకొండు కోట్లకు పైగా చెల్లించి ఈ సినిమాని కొన్నది.తొలిసారి టెలికాస్ట్ చేసినప్పుడే డిజాస్టర్ టిఆర్పీ రేటింగ్స్ వచ్చాయి ఈ సినిమాకి.
ఇక రిపీట్ టెలికాస్ట్ లో ఏం వస్తుందని.ఎలాగో మాస్ ప్రేక్షకులు, యువత ఈ సినిమాకి మైళ్ళ దూరంలో ఉంటారు .ఫ్యామిలి ప్రేక్షకుల కోసం అని తీస్తే, ఆ వర్గం వారిని కూడా చిత్రహింస చేసిన ఈ చిత్రాన్ని చూడ్డానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదట.
దాంతో జీ తెలుగు ఈ సినిమా సాటిలైట్ రైట్స్, తక్కువ మొత్తానికైనా, మరో ఛానెల్ కి అమ్మేసే ఆలోచనలో ఉందట.
అలాగైనా ఎంతోకొంత జేబులో పడతాయని వారి ఆశ.టివి టెలికాస్ట్ లో మిగితా ఎక్కువ హీరోల కన్నా ఎక్కడ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటి ఉన్న మహేష్ కి ఇంతకుమించిన అవమానకరమైన విషయం మరొకటి ఉంటుందా? ఈరకంగా బ్రహ్మోత్సవం ఓ చేదు నిజంలా మహేష్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది.