కీర్తి సురేష్ ని ఓ పనిదానిలా చూసారట

ఇప్పుడు కీర్తి సురేష్ అంటే ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్రహీరోయిన్.అక్కడ విజయ్ తో ఇప్పటికే జోడి కట్టిన ఈ అమ్మడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో నటించబోతోంది.

 Keerthy Suresh Narrates Racial Discrimination She Faced-TeluguStop.com

ఇప్పుడంటే పేరు, డబ్బు ఉన్నాయి కాని ఒకప్పుడు కీర్తి కూడా మామూలు అమ్మాయే కదా.ఆ సమయంలో తాను పడిన కష్టాలును చెప్పుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

డిగ్రీ రోజుల్లో కీర్తి కొన్ని నెలలపాటు స్కాట్ లాండ్ లో చదువుకోవాల్సి వచ్చిందట.ఆ తరువాత లండన్ లో ఓ నెలన్నర ఇంటర్న్ షిప్ చేసిందట.స్కాట్ లాండ్ లో ఉల్లాసంగా గడిచింది జీవితం కాని, లండన్ లో నరకం చూసానంటోంది కీర్తి.

అక్కడ వర్ణవివక్ష ఎక్కువంట.

తాను భారతీయురాలిని కావడంతో, పనిచేస్తున్న బట్టల కంపెనీ వారు తనని ఓ పనిదానిలా చూసాసరట.కొత్తగా డిజైన్ చేసిన బట్టలు తీసుకోని వారి ఫ్యాక్టీరలో ఇచ్చిరమ్మని పంపేవారని, స్థానికులకు మాత్రం అలాంటి కష్టతరమైన పనులు చెప్పేవారు కాదని చెప్పుకొచ్చింది కీర్తి.

ఓరకంగా ఆ కష్టాలే కీర్తికి పనికొచ్చాయని చెప్పాలి.అక్కడ అంతా కరెక్టుగా ఉండుంటే, తను అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిపోయేదేమో కదా! అప్పుడు ఇంత పెద్ద హీరోయిన్ గా ఎదిగేది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube