మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ తను.తెలుగుతో పాటు హిందీ సినిమాలు చేసింది, చేస్తూనే ఉంది.
మంచి కథ, తనకో మంచి పాత్ర దొరికితే చాలు, భాష భేదం లేకుండా సినిమాలు చేయాలనే మనస్తత్వం ఆమెది.చాలా టాలెంటెడ్.
మంచి నటిగా పేరు తెచ్చుకుంది.పర్సనల్ వ్యవహారాలతో పెద్దగా వార్తల్లో నిలిచింది లేదు.
కాని ఇకపై అలాంటి వార్తలతోనే మీడియా పెన్నుకి చిక్కుతుందేమో.
మొన్న రాత్రి ఓ పెద్ద స్టార్ హోటల్ దగ్గర ఈ అమ్మడు కనిపించింది.
ఒంటరిగా ఉంటే ఎందుకు వార్త అవుతుంది, ఒంటరిగా లేదు.ఎవరో హ్యాండ్ సమ్ తోడుగా ఉన్నాడు.
మన దేశపు అబ్బాయైతే కాదు.ఇద్దరు కాసేపు అటుఇటు దిక్కులు చూసారు .తమని ఎవరైనా గమనిస్తున్నారేమో చెక్ చేసుకున్నట్లు.ఎవరు కనిపించకపోయే సరికి, మీడియా కూడా లేకపోయేసరికి ఇద్దరు లోనికి ఒకరి చేతుల్లో ఒకరు చేయేసి వెళ్ళిపోయారు.
ఆ ఫారేన్ ఫ్రెండ్ తో అంత రాత్రిపూట ఆ హీరోయిన్ కి ఏం పని ఉండి ఉంటుంది అని చాటుగా చూసిన వారు బుర్ర బద్దలుకొట్టుకుంటున్నారు.







