యాంకర్ అనసూయ సాయిధరమ్ తేజ్ నటిస్తున్న “విన్నర్” సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇటివలే ఆ స్పెషల్ సాంగ్ ని ఫారెన్ లో వేసిన ఓ సెట్ లో చిత్రీకరించారు.
అయితే దీన్ని ఐటం సాంగ్ అనొద్దని, ఇది ఐటం సాంగ్ కాదు అని, ఒక స్పెషల్ సాంగ్ అని చెబుతోంది అనసూయ.
ఇటివలే ఒక ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటి ఇస్తూ అమ్మాయిలని ఐటం అని పిలవోద్దు, అమ్మాయి వస్తువు కాదు, అమ్మాయి షేప్ ని చూస్తూ ఐటం అని ఎవరో తెలియని వారు ఆ పదాన్ని వాడటం మొదలుపెట్టారని, దాని ఐటం సాంగ్ అని కాదు, స్పెషల్ సాంగ్ అనాలని, ఒక అమ్మాయి తన డ్యాన్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు తనని గౌరవించాలని క్లాస్ పీకినంత పనిచేసింది.
కాబట్టి మీకు అనసూయ కనబడితే పొరపాటున కూడా ఐటెం సాంగ్ చేస్తున్నారా అని అడగొద్దు, స్పెషల్ సాంగ్ అనే పదాన్నే వాడండి.







