సైలెంట్ గా వచ్చి సునామి సృష్టించింది బిచ్చగాడు సినిమా.కేవలం 50 లక్షలు ఖర్చుపెట్టి డబ్బింగ్ ఖర్చులు, హక్కులు వేల్లదీస్తే, ఏకంగా 16 కోట్ల షేర్ సాధించి భారి లాభాలను సంపాదించింది పెట్టింది ఆ చిత్రం.
దాంతో తెలుగునాట హీరో విజయ్ అంటోనికి మంచి గుర్తుంపు లభించింది.ఇప్పుడు ఆ హీరో నటించిన బేతాళుడుని మంచి రేట్లకు అమ్మారు.
3 కోట్లకు డబ్బింగ్ హక్కులు కొంటే, 6 కోట్లకి పంపినిదారులకు అమ్మారు.అంటే తెలుగు నిర్మాతలకి విడుదలకి ముందే 3 కోట్ల లాభం చేతిలో పడింది అన్నమాట.
చూసారా .ఒక్క సినిమా విజయ్ అంటోని కెరీర్ నే మార్చేసింది.మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతోంది.
మరి ఈ చిత్రం అంచనాలకి మించి మళ్ళీ బయ్యర్లని లాభాల బాట పట్టిస్తుందో లేక బిచ్చగాడు ఒక గాలి విజయం, విజయ్ కి అప్పుడే తెలుగులో మార్కెట్ రాలేదు అని రుజువు అవుతుందో చూద్దాం
.







