ఎన్టీఆర్‌ అభిమానుల బాధ తీరిపోతుంది త్వరలో

మహేష్ బాబు తదుపరి సినిమా కొరటాల శివతో, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తో, ప్రభాస్ తదుపరి సినిమా సుజీత్ తో, రామ్ చరణ్ తదుపరి సినిమా సుకుమార్ తో, అల్లు అర్జున్ తదుపరి సినిమా లింగుస్వామితో.ఇలా టాప్ హీరోలందరు ఇప్పుడు ఓ ప్రాజెక్టుతో బిజీగా ఉండగానే తమ తరువాతి సినిమాలు ప్రకటించేసారు.

 Ntr To Announce His Next In Ism Audio Launch?-TeluguStop.com

కాని ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఎలాంటి క్లారిటి ఇవ్వలేదు ఇంతవరకు.అపుడెప్పుడో ప్రకటించిన వక్కంతం వంశీ ఇంకా ఉందా, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా ఎప్పుడో పక్కన పెట్టేసారా అనే విషయం ఇంకా తేలనే లేదు

పూరితో సినిమా అన్నారు, దర్శకుడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు కూడా.

కాని ఎన్టీఆర్ వైపునుంచి ఇంకా పక్క సమాచారం లేదు.అలాగే ఎన్టీఆర్ పీఅర్ టీమ్ త్రివిక్రమ్ ని ఎప్పటినుంచో సంప్రదిస్తున్నారు.

కాని మన మాటల మాంత్రికుడు పవన్ కోసం కథ రాసే పనిలో బిజీగా ఉండి సరైన స్పందన ఇవ్వట్లేదట.ఇంకోవైపు రామ్ తో సినిమా వదిలేసికోని వచ్చి కూర్చున్నాడు అనీల్ రావిపూడి

ఈ నెల 5వ తేదిన ఇజమ్ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది.

ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ సినిమా ఫంక్షన్ కి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రానున్నాడు.వేదికపై ఎలాగో పూరి జగన్నాథ్ ఉంటారు.

కాబట్టి ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించి ఈ ఫంక్షన్ లోనే ఓ క్లారిటి రావడం ఖాయం ! దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ తీరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube