మహేష్ తెచ్చిన నష్టాలు అలా భర్తి చేస్తారట

జీవితంలో మహేష్ బాబు కాని, మహేష్ బాబు అభిమానులు కాని, మళ్ళీ వినడానికి ఇష్టపడని సినిమా పేరు “బ్రహ్మోత్సవం”.డిజాస్టర్లకే డిజాస్టర్ అనే బిరుదుని మూటగట్టుకోని, బయ్యర్లకి పట్టపగలే నక్షత్రాలు, గ్రహాలు .

 Pvp To Compensate Brahmotsavam Buyers With Kashmora Rights?-TeluguStop.com

అన్ని చూపించేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లో అతిపెద్ద డిజాస్టర్ గా, ఓవరాల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత అత్యధిక నష్టాలు తెచ్చపెట్టిన సినిమాగా చెడ్డపేరుని వెనకేసుకుంది.

ఈ నష్టాలు తీర్చేందుకు మహేష్ బాబు కొంత సహాయం చేసాడని టాక్.

అయితే కొంత అనే పదానికి మొత్తం అని పదానికి చాలా తేడా ఉంది కదా.మొత్తం నష్టాల్ని భరించకున్నా, తమవంతు సహాయం బ్రహ్మోత్సవం బయ్యర్లకు చేయాలని భావించిన పి.వి.పి సంస్థ ఇప్పుడు బ్రహ్మోత్సవం బయ్యర్లల ముందు ఓ కొత్త డీల్ పెట్టే అలోచనలో ఉన్నట్లు టాక్.

విషయంలోకి వెళ్తే, కార్తీ నటిస్తున్న “కాష్మోరా” ని పివిపి నిర్మించింది.ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను, బ్రహ్మోత్సవం వలన నష్టపోయినవారికి చాలా తక్కువ రేటులో, కుదిరితే కొందరికి ఉచితంగానైనా ఇచ్చేసే అలోచనలో పివిపి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో నిజానిజాలు ఇంకా పూర్తిగా బయటకి రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube