ఫ్యామిలీ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించిన జగపతిబాబు ఇక హీరోగా కెరియర్ ఎండ్ అవ్వగా విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నాడు.అయితే ఇక అప్పటి నుండి జగ్గూభాయ్ రేంజ్ మళ్లీ పీక్ స్టేజ్ కు వెళ్లింది.
లెజెండ్ తో విలన్ గా మారిన జగపతిబాబు ఆ సినిమా తర్వాత తన కోసం కొత్త పాత్రలు సృష్టించుకునేలా చేశాడు.స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న జగ్గు భాయ్ ప్రస్తుతం కొత్త కుర్రాడు నిఖిల్ గౌడ నటించిన జాగ్వార్ సినిమాలో విలన్ గా చేశాడు.
ఆ సినిమా ఆఫర్ రావడమే కాదు ఆ అవకాశంతో నిర్మాత కుమారస్వామిని బుట్టలో వేసుకున్న జగపతి బాబు మళ్లీ హీరోగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.సినిమా టైంలో కుమారస్వామితో మంచి స్నేహబంధం ఏర్పడటంతో జగపతి బాబు హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కుమార్ స్వామి.
ఇక ఈ సినిమా కూడా తెలుగు కన్నడ భాషల్లో ఉంటుందని అంటున్నారు.సో హీరో నుండి విలన్ గా టర్న్ తీసుకుని మళ్లీ హీరోగా వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
మరి ఈసారి హీరోగా జగపతి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.







