‘జనతా గ్యారేజ్’ సినిమాపై రోజురోజుకి పాజిటివ్ టాక్ పెరిగిపోతుంది.ఈ నేపథ్యంలో కొరటాల ఇంకా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
సెన్సార్ పూర్తీ అయ్యాక కూడా రిపేర్లు మొదలు పెట్టాడు.ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం సినిమా నిడివి విషయంలో దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
సినిమా నిడివి ఎక్కువైతే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని…అందుకే కొంచెం నిడివి తగ్గించే పనిలో పడ్డారు జనతా యూనిట్.
ఇప్పటికే మోహన్ లాల్ కి సంబందించిన రెండు సన్నివేశాలను తీసేయటమే కాకుండా అజయ్, బ్రహ్మజీలపై తెరకెక్కించిన సీన్లను ట్రిమ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
సినిమా చివరలో 6 నిమిషాల నిడివి తగ్గి 2గంటల 25 నిమిషాలకు సినిమాను కుదించారని సమాచారం.ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ కూడా ‘శ్రీమంతుడు’ సెంటిమెంట్ ను ఫాలో అయ్యి స్పెషల్ షో ను తెల్లవారుజామున వెయ్యాలని అనుకుంటున్నారు.







