ఆ డైరక్టర్ అత్యాశపడ్డాడు .. తిక్క కుదిరింది

ఆ చిన్న దర్శకుడు గత ఏడాది మంచి హిట్ మూవీ తీసాడు.ఇండస్ట్రీ జనాలందరు ఆ సినిమాతో పాటు ఆ దర్శకుడిని మెచ్చుకున్నారు.

 Overconfident Telugu Director Gets Into Flop Streak-TeluguStop.com

అలాగే ఓ స్టార్ హీరో కూడా అభినందించాడు.దానికి ఆ దర్శకుడు “సార్ సినిమా చేద్దాం మనం” అని అడిగేసాడు.

ఆ మాట వినగానే ఆ హీరోగారికి చాలా కోపం వచ్చిందట.

ఎందుకంటే పెద్ద పెద్ద దర్శకులు కూడా కథ పూర్తి చేసుకోనిదే ఆయన్ని సినిమా అవకాశం కోసం అడిగేందుకు సందేహిస్తారు.

అలాంటిది ఏదో అభినందించడానికి పిలిస్తే సినిమా అవకాశం అడుగతాడేంటి, అప్పుడే అంత పెద్దోడు అయిపోయాడా అని తన సన్నిహితుల దగ్గర వాపోయాడట ఆ హీరో.

సదరు దర్శకుడి ధైర్యం అప్పుడు అందరికి కాన్ఫిడెన్స్ లాగా కనిపించింది.

సక్సెస్ ఉంది కాబట్టి అడిగేశాడు అని అనుకున్నారంతా.కాని ఇప్పుడు వరుసగా రెండు అపజయాలు తగిలేసరికి అందరు ఆ దర్శకుడిని తిట్టుకుంటున్నారు.

అప్పుడు సాధించిన విజయాన్ని గాలి గెలుపుగా వర్ణిస్తున్నారు.అత్యాశపడ్డాడు .ఇప్పుడు తిక్క కుదిరింది అని మాట్లాడుకుంటున్నారు ఫిలింనగర్ జనాలు.ఇక ఆ దర్శకుడు తన తప్పులని అర్థం చేసుకోని మళ్ళీ ఏదో చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube