మనిషి శరీరంలో అత్యంత అందమైన భాగాలుగా పెదాల్ని చెబుతారు.సున్నితంగా, కొమలంగా ఉండే పెదాలు ప్రేమను వ్యక్తపరిచే శారీరక సాధనాలు.
ఈ పెదాల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు మీకోసం.
* ఎలాగైతే ఒకరి వేలిముద్రలు మరొక వ్యక్తి వేలి ముద్రలతో పోలి ఉండవో, పెదాల ముద్రలు అంతే.
ఏ ఇద్దరి మనుషుల పెదాల ముద్ర ఒకేలా ఉండదు.
* పెదాలకు చెమట పట్టదు.
పెదాల్లో స్వెట్ గ్లాండ్స్ లేకపోవడమే దీనికి కారణం.
* పెదాలు చాలా సున్నితమైనవి.
మిలియన్ల కొద్ది నెర్వ్ ఎండిగ్స్ ఉన్నా, పెదాలని రక్షించేందుకు ఒక్క డిఫెన్సివ్ మెంబ్రేన్ కూడా ఉండదు.
* పెదాలు చాలా ట్రాన్స్పరెంట్ ఉండే శరీర భాగలు.
చర్మం మీద 16 లేయర్లు ఉంటే, పెదాలపై 3-6 లేయర్స్ మాత్రమే ఉంటాయి.పెదాలు ఎర్రగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం.
* చర్మంలోలాగా పెదాల్లో నేచురల్ ఆయిల్స్ ఉండవు.కాబట్టి పెదాలు ఎలాంటి దాడికైనా సునాయాసంగా లొంగిపోతాయి.
అది దుమ్ము కావచ్చు లేదా ఎండ కావచ్చు లేదా ఇంకేదైనా ఇంఫెక్షన్ కావచ్చు.
* అమ్మాయిల పెదాలు పెద్దగా ఉంటే అబ్బాయిలకు ఇష్టం.
దానికి పూర్తి వ్యతిరేకంగా, పెదాలు లావుగా ఉండే అబ్బాయిలు ఆకర్షణీయంగా కనిపించరు అమ్మాయిలకి.
* పెదాలతో రకరకాల మూడ్స్, ఎమోషన్స్ చూపించవచ్చు.
మరీముఖ్యంగా అమ్మాయిల మూడ్ ని అంచనా వేసేందుకు వాళ్ళ పెదాలను గమనించడం పనికిరావచ్చు.
* వయసు పెరిగినాకొద్ది పెదాలు పల్చగా మారుతుంటాయి.







