చైతు కోసం సమంత లవ్ సింబల్స్..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత అక్కినేని నాగ చైతన్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్నదన్న సంగతి తెలిసిందే.పైకి చెప్పక పోయినా సరే ఇద్దరికి ఇద్దరు ఇష్టమే విషయం ఎన్నోసార్లు వ్యక్తపరిచారు.

 Samantha Love Symbles For Chaitu-TeluguStop.com

ఇప్పుడు సమంత మరో అడుగు ముందుకేసి లవ్ సింబల్స్ ను చైతుకు రిప్లై ఇచ్చింది.మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమం తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమా నుండి పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి సమంత లవ్ సింబల్స్ తో రిప్లై ఇచ్చింది.మూడు ప్రేమ చిహ్నాలను ట్వీట్ చేసిన సమంత మెసేజ్ మాత్రం ఏం పెట్టకుండా అన్నిటిని వాటితోనే అర్ధం చేసుకోండి అన్నట్టు పెట్టింది.

సమంత సిగ్నల్స్ చూస్తుంటే మరోసారి చైతు మీద తనకున్న ప్రేమను తెలియచేసింది అంటున్నారు.ఇక వినిపిస్తున్న మరోమాట ఏంటంటే సినిమాలో త్రీ జెనరేషన్స్ ఆఫ్ లవ్ ఉంటుంది.

రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కూడా చైతు మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు.సో ఆ మూడు పిక్స్ కు మూడు లవ్ సింబల్స్ పెట్టిందేమో అంటున్నారు.

ఏది ఏమైనా సమంత చేస్తున్న ఈ ట్విట్టర్ హంగామా నెటిజెన్లను మరింత ఆకట్టుకుంటుంది.కార్తికేయ దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube