ఈ సమ్మర్లో సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా అందరికి షాక్ ఇస్తూ హరీష్ శంకర్ తో చేసేందుకు సిద్ధమయ్యాడు.సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత ఏ సినిమా కమిట్ అవని హరీష్ ఎట్టకేలకు బన్నిని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్ని మరోసారి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది.ఆల్రెడీ అల్లు అర్జున్ పూరి డైరక్షన్లో వచ్చిన దేశముదురు సినిమాలో సిక్స్ ప్యాక్ తో ఫ్యాన్స్ ను అలరించాడు.
ఇప్పుడు హరీష్ డైరక్షన్లో రాబోతున్న సినిమాలో కూడా బన్ని సిక్స్ ప్యాక్ షురూ చేస్తున్నాడట.సరైనోడులో కూడా కండలు తిరిగిన దేహంతో కనిపించిన బన్ని అదే దేహ దారుడ్యంతో వచ్చే సినిమాలో కూడా కనిపించనున్నాడు.
టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రై చెసిన మొదటి హీరోగా బన్ని దేశముదురు టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.మరి ఇప్పుడు వరుస హిట్స్ తో ఫాంలో ఉన్న బన్ని చేస్తున్న ఈ సిక్స్ ప్యాక్ ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
.






