నందమూరి అభిమానులకు శుభవార్త.అది ఏమిటంటే బాలయ్య అతి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని నటిస్తున్న 100 వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా రానున్నదని సమాచారం.
అయితే ఈ సినిమా ప్రారంభం నుంచే సంక్రాంతికి విడుదల చేయాలనీ అనుకున్నారు.ఇప్పుడు సంక్రాతినే ఫిక్స్ చేసారు.
ఇప్పటివరకు జార్జియాలో చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంది.ఈ సినిమాకి దర్శక,నిర్మాత అయిన క్రిష్ కి పెళ్లి కుదరడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు బాలకృష్ణ.
ఈ సినిమాను చాలా మక్కువ మరియు పట్టుదలతో అన్ని విభాగాల్లోనూ ఫర్ఫెక్ట్ వచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మన తెలుగు రాష్ట్రాన్ని పాలించిన శాతకర్ణి వీరత్వాన్ని అభిమానులకు తెలియచెప్పటానికి ఈ సినిమా తీస్తున్నానని క్రిష్ చాలా సార్లు చెప్పాడు.
ఈ సినిమా కథ బాలయ్య బాబుకి క్రిష్ చెప్పగానే ఒకే చెప్పాడు.బాలకృష్ణ సందర్భం వచ్చిన ప్రతి సారి తెలుగు జాతి ఔనత్యాన్ని చెపుతూనే ఉంటాడు.
అటువంటి బాలయ్య బాబు ఈ సినిమా చేస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.







