ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా వాడుతున్న మెసెంజర్ వాట్సాప్.ఇది మెసెజ్ చేయడానికి సులభంగా, ఆకర్షణీయంగా ఉండటమే దీనికి ఎదుగుదలకు కారాణం.
బ్లాక్ బెర్రీ ఫోన్ల ఆధిపత్యానికి తెరదించి, ఆండ్రాయిడ్ యూజర్లు, ఐఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ ఆప్.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తన యూజర్స్ కి అందిస్తూ, మెసేజింగ్ ప్లాట్ఫారంలో మకుటంలేని మహారాజుగా ఎదగిన వాట్సాప్ కొన్ని కొత్త ఆప్షన్స్ అల్రెడి ఇస్తోంది మరికొన్ని కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి తేనుంది.అవేంటి చూద్దాం.
1) కాల్ బ్యాక్ :.
వాట్సాప్ లో ఫోన్ కాల్ అప్షన్ గత సంవత్సరమే ఇచ్చినా, కాల్ బ్యాక్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు.సరికొత్తగా వెర్షన్ 2.16.189 లో ఈ ఆప్షన్ ఇస్తున్నారు.
2) మెసేజ్ కోట్ :.
డిస్కషన్ బోర్డ్స్ లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కోట్ ఆప్షన్, ఆ తరువాత ట్విట్టర్లోకి వచ్చేసింది.ఇప్పుడు వాట్సాప్ కూడా వేరే యూజర్ మెసెజ్ ని కోట్ చేసే అవకాశం కల్పిస్తోంది.ఓసారి అప్డేట్ చేయండి.ఈ ఆప్షన్ అల్రెడి వచ్చేసింది.
3) కొత్త ఫాంట్స్ :.
ఏళ్ళుగా ఒకే ఫాంట్ వాడి వాడి బోర్ కొట్టేసిందా … ఫాంట్ మార్చకోని టైప్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చేసింది వాట్సాప్.
4) వాయిస్ మేయిల్ :.
ప్రతీసారి ఫోన్లో మాట్లాడటం కుదరదు కదా.అందుకే వాయిస్ మేయిల్ ని అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.పేరు మారిందే కాని ఇదేమి కొత్త ఆప్షన్ కాదు.ఇంతకముందు కూడా మెసేజ్ ని రికార్డు చేసి పంపించగలిగేవాళ్ళం.
5) ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ :.
ఈ అప్డేట్ ఈ మధ్యే వచ్చింది.ఇద్దరు యూజర్లు పక్కనే ఉండి స్కానింగ్ ద్వారా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ చేసుకోవాలి.ఇలా చేస్తే, మీ మెసేజెస్ ఏ థర్డ్ పార్టీ వాళ్ళు చదవలేరు.
6) మెన్షన్స్ :.
ఫేస్ బుక్, ట్విట్టర్ అంతలా ఫేమస్ అవడానికి కారణం మనకు కావాల్సిన యూజర్ ని మెన్షన్ చేసే ఆప్షన్ ఉండటమే.వాట్సాప్ గ్రూప్ చాట్ లో ఈ ఆప్షన్ లేక, చాలా ఇబ్బందిపడేవారు.ఇప్పుడు ఆ లోటు కూడా తీరుస్తోంది వాట్సాప్.
7) మ్యూజిక్ షేరింగ్ :.
ప్రత్యేకంగా మ్యూజిక్ షేరింగ్ ఆప్షన్ ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్.ఇక మీకు ఇష్టమైన సంగీతం మీరు వింటూనే, మీ స్నేహితులకి వినపించవచ్చు.
8) GIF సపోర్ట్ :.
ట్విట్టర్ దెబ్బకు ఫేస్ బుక్ కూడా GIF ఫైల్స్ ని ప్లే చేయడం మొదలుపెట్టింది.ఇప్పుడు వాట్సాప్ కూడా పోటీలో నిలబడేందుకు GIF ఫైల్స్ ని సపోర్టు చేస్తుంది.
9) వీడియో కాలింగ్ :.
ఎక్కడా తగ్గకుండా వీడియో కాలింగ్ ఆప్షన్ ని కుడా తీసుకువస్తోంది వాట్సాప్.ఈ ఆప్షన్ ని వాట్సాప్ ఇప్పటికే చాలామంది వినియోగదారులకు ఇచ్చి మళ్ళీ తీసేసిందని టాక్.
10) పెద్ద ఇమోజి :.
వాట్సాప్ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఇమోజి.త్వరలోనే ఇమోజి హావభావాలు మరింత పెద్దగా డిస్ప్లే అవనున్నాయి.