ఎప్పుడైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆగష్టు 12న రావట్లేదు అని న్యూస్ వచ్చిందో మిగతా సినిమాల వారికి ఊపిరి వచ్చినంత పని అయ్యింది.అందుకే ఇన్నాళ్లు రిలీజ్ డేట్ కన్ ఫ్యూజన్ లో ఉన్న సినిమాలన్ని రిలీజ్ కన్ఫాం చేస్తున్నాయి.
అనుకున్న డేట్ ప్రకారం అసలైతే ఆగష్టులో జూనియర్ సందడి ఉందనుకున్నారు కాని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా దాన్ని సెప్టెంబర్ కు షిఫ్ట్ చేశారు.
అందుకే విక్టరీ వెంకటేష్ మారుతిల కాంబినేషన్లో వస్తున్న బాబు బంగారం, సుప్రీం హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్న తిక్క, చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న మనమంతా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.
గోపాల గోపాల తర్వాత వెంకీ బంగారు బాబుగా వస్తున్నాడు.భలే భలే మగాడివోయ్ హిట్ తో రేంజ్ పెరిగిన మారుతి వెంకటేష్ ను ఏవిధంగా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక సుప్రీం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ మరోసారి తన మెగా తిక్క చూపించేందుకు వస్తున్నాడు.
ఇవి రెండు కమర్షియల్ సినిమాలైతే మనసుకి హత్తుకునే కథాశంతో నలుగురు జీవితాల కథా నేపథ్యంతో విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మనమంతా కూడా ఈ ఆగష్టు పోటీలో నిలుస్తుంది.
మరి జూనియర్ తప్పుకోగానే పోటీలో నిలుస్తున్న ఈ మూడు సినిమాలు ఒక్కరోజు తేడాతో రిలీజ్ అవుతుండటం విశేషం.మరి వీటిలో ప్రేక్షకుల మనసు గెలుచుకునే సినిమా ఏదవుతుందో చూడాలి.







