చాలా మంది మగవారికి అంగస్తంభన సమస్య ఉంటుంది.దీనికి కారణాలు అనేకం.
వంశపారంపర్యంగా కావచ్చు, సొంత అలవాట్ల వలన కావచ్చు, డిప్రేషన్, స్ట్రెస్ తిండి… ఇలా ఎన్నో కారణాలు.అయితే, ఈ సమస్య తో పోరాడలంటే కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
వాటి ద్వారా లేని సమస్య రాకుండా కాచుకోవచ్చు, వచ్చిన సమస్యతో పోరాడవచ్చు.
అంగస్తంభన సమస్యతో బాధపడేవారు ఎల్ ఆర్జినిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు డాక్టర్లు.
అంటే కోడి మాంసం, రెడ్ మీట్, చేపలు, పాల ఉత్పత్తులు లాంటివి అన్నమాట.
పుచ్చకాయలో లభించే సిట్రులిన్ అనే పదార్థం రక్తనాళాల్ని వ్యాకోచింపజేసే గుణాన్ని కలిగి రక్త ప్రసరణను ఎక్కువ చేస్తుంది.
అంగం గట్టిపడటానికి ఇది చాలా అవసరం.అలాగే, ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
పిస్తా నట్స్‌లో ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్థాలతో ఎల్ అర్జినిన్ ఎక్కువగా ఉంటుంది.
పాలకూరలు, బ్రాకోలి, మెంతికూరల్లో కూడా నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి రక్తనాళాల్ని వ్యాకోచింపజేసి రక్త సరఫరాను పెంచుతాయి.తద్వారా పురుషాంగంలోకి రక్తం బాగా సరఫరా అయ్యి అంగస్తంభనలు మెరుగుపడతాయి.
పురుషాంగానికి మంచి స్నేహితుల లాంటివి ఈ ఆహారపు పదార్థాలు.
రక్తప్రసరణను మెరుగుపరిచే ఈ ఆహరపు పదార్థాలు, ఇటు పురుషాంగానికి అన్నివిధాల సహాయం చేస్తూనే, గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటూ, గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.