జాతీయ జండాని అవమానించిన మోడీ .. కేసు

జాతీయ భావానికి నిలువెత్తు రూపంగా కొలిచే నరేంద్ర మోడీ స్వయంగా జాతీయ జెండా ని తప్పుగా వాడారు అంటూ గొడవ జరుగుతోంది.మోడీ కి దేశ భక్తి విషయం లో ఎవ్వరూ సాటి రారు అంటూ ఉదయం లేచిన దగ్గర నుంచీ బీజేపీ వాయిస్తూ ఉంటుంది కానీ ఆయన జండాని అత్యంత దారుణంగా అవమానించారు అని కోర్టులో ప్రస్తుతం కేసు నమోదు అయ్యింది.

 Case Filed Against Pm Narendra Modi-TeluguStop.com

ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగౌరవపరిచారన్నది ఆయనపై ప్రధాన అభియోగం.జాతీయ పతాకాన్నిమామూలు గుడ్డ ముక్కగా పరిగణించిన ప్రధాని దానిని కింద పరుచుకున్నారని.

దానిపై కూర్చున్నారని.అక్కడితో ఆగకుండా దానితో చేతులు కూడా తుడుచుకున్నారని పిటిషనర్ ఆరోపించారు.

మోడీ చేసినట్లుగా చెబుతున్న ఆ పనులకు సంబందించిన ఫొటోలను ఇంటర్నెట్ నుంచి సేకరించిన బీహార్ కు చెందిన ప్రకాశ్ కుమార్ ముజఫర్ నగర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube