కాజల్ లక్కి ఛాన్స్ కొట్టేసింది

తెలుగు ఇండస్ట్రీ లోంచి సడెన్ గా మాయమైపోయింది కాజల్ .ఇక పని అయిపొయింది అని అందరు అనుకుంటున్న తరుణంలో ఏకంగా రెండు భారి ప్రాజెక్టులు పట్టేసింది .

 Kajal To Star In Thala Ajith’s Next-TeluguStop.com

అది కూడా అలాంటి ఇలాంటి ప్రాజెక్టులు కాదు .తెలుగు సినిమాకు రెండు కన్నులుగా చెప్పుకునే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు .

కాని దరిద్రం నెత్తిపై డ్యాన్స్ చేసినట్టుగా , సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం , రెండిటికి రెండు భారి డిజాస్టర్ సినిమాలుగా మిగిలాయి .దాంతో కాజల్ కథ మళ్ళి మొదటికే వచ్చింది .మళ్ళీ అవకాశాల కొరతే .ఇక కాజల్ పని అయిపోయినట్టే అని మళ్ళీ అందుకున్నారు విమర్శకులు .కాని కాజల్ కి ఎక్కడో సుడి ఉంది .మరో భారి ఆఫర్ కొట్టేసింది .

ఈసారి తమిళంలో .స్టార్ హీరో అజిత్ తో దర్శకుడు శివ మరో చిత్రం చేయబోతున్న సంగతి తెల్సిందే .వీరమ్ , వేదాలం వంటి రెండు బ్లాక్బస్టర్ల తరువాత ఈ కాంబినేషన్లో వస్తున్నా మూడోవ సినిమా ఇది .ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట .అందులో కాజల్ ఒక హీరోయిన్ అని సమాచారం .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube