కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటిని పోలీసులు పరిశీలించారు.ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
శు క్రవారం ఉదయం న్యూఢిల్లీ లోని తుగ్గక్ లేన్‌లో రాహుల్ పేరున ఇంటి నంబర్ 12 ని శిప్రా సన్ సిటీ పోలీసు పోస్ట్ కు చెందిన పోలీసులు ప్రత్యేకం గా ఈ తఖీని నిర్వహించారు.గతంలో ఇంటి నంబర్ 12 విషయమై తమ ఠాణాలో దాఖలైన కేసులో రాహుల్ గాంధీ ఇచ్చిన చిరునామాలోని వాస్తవాలను పరిశీలించుకునేందుకే రాహుల్ ఇంటికి వాళ్ళమని, ఇందులో విశేషం ఏమీలేదని , తనిఖీలో పాల్గొన్న ఇందిరాపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ గోరఖ్ నాథ్ యాదవ్ మీడియాకు చెప్పారు.
చట్టాన్ని దుర్వి నియోగం చేసినట్లు రుజువైతే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకునే వీలుందని అన్నారాయన







