ప్రస్తుత హైకోర్టు తెలంగాణదే ....

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కొత్త‌గా హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వెల్ల‌డించారు.

మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విభజన చట్ట ప్రకారం ప్రస్తుత హైకోర్టు తెలంగాణకి చెంద‌నుంద‌ని స్ప‌స్టం చేసారాయ‌న‌.

ఈ క్రమంలోనే ఏపిలో హైకోర్టు ఏర్పాటు విష‌య‌మై ఇప్ప‌టికే ముఖ్య‌మం్ర‌తి చంద్రబాబుతో చ‌ర్చ జ‌రిపామ‌ని చెప్పారు.అయితే హైకోర్టు విష‌య‌మై దాఖ‌లైన పిటీష‌న్ల‌పై కేసులు నడుస్తు న్నందున తీర్పు కోసం వేచి చూసు్త‌న్న‌టు్ల తెలిపారాయ‌న రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైకోర్టు ఏర్పాటు విషయమై అందుతున్న విన‌తుల‌ను దృష్టి లో ఉంచుకుని, చంద్ర బాబు తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

తదుపరి ఏపి సిఎం నిర్ణయం మేరకు ఎక్కడ చేయ‌మంటే అక్క‌డ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ద‌మేన‌ని తెలిపారు .

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు