సాధారణంగా 82 ఏళ్ల వయసు వచ్చిన పెద్దలు ఏం చేస్తారు.మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతూ, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటారు.
కానీ అందరిలా ఉంటూ తనకు వాళ్లకు ఏం తేడా వుంటుందని భావించిన ఓ పెద్దాయన భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యపై పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు.
పంజాబ్‌లోని భటిండాకు చెందిన అమ్రిక్ సింగ్ థిల్లాన్ ఇంగ్లాండ్‌లోని ఆసియా కల్చరల్ కమ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా పనిచేసి పదవి విరమణ చేశారు.
ఇటీవల భారతదేశానికి తిరిగొచ్చిన ఆయనకు దేశంలో నానాటీకి పెరుగుతున్న ట్రాఫిక్‌తో పాటు ప్రతీ ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతి చేశారు.ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు గాను పుస్తకం రాశారు.
భారత్, ఇంగ్లాండ్‌లోని ట్రాఫిక్ నిబంధనలు పోల్చి చూడటంతో పాటు వాటి అమలులో ఇరుదేశాల మధ్య వున్న వ్యత్యాసాన్ని గమనించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధిల్లాన్ తెలిపారు.

పంజాబ్ రవాణా శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ట్రాఫిక్ కన్సల్టెన్సీలతో చర్చలు జరిపి ఈ అంశంపై తాను లోతుగా పరిశోధన చేశానని ఆయన వెల్లడించారు.ఆ తర్వాతే భారత్‌లోని ట్రాఫిక్ సమస్యలపై వివరణాత్మక పుస్తకం రాశానని ధిల్లాన్ తెలిపారు.భటిండాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తానొక న్యాయవాదినని, కానీ దేశంలో ప్రస్తుతం అమల్లో వున్న పేలవమైన ట్రాఫిక్ నిబంధనలు ఆలోచింపజేశాయని చెప్పారు.
భారతీయులు ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా పట్టించుకోకపోవడం తను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.ఆక్స్ఫర్డ్ నగరంలో పనిచేస్తున్న సమయంలో భారత్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని తాను భావించానని ధిల్లాన్ చెప్పారు.

అధ్యయనంలో భాగంగా భారతీయ రహదారులపై 12 ప్రధాన ట్రాఫిక్ ఉల్లంఘనలను తాను గుర్తించి ఈ పుస్తకంలో పరిష్కారాన్ని సూచించాని ఆయన పేర్కొన్నారు.వీటిలో ప్రధానంగా లేన్ పొజిషనింగ్, ఎమర్జెన్సీ బ్రేక్స్, ఓవర్ స్పీడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం ఉన్నాయి.ప్రజలు కేవలం 40 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడంతో పాటు టర్నింగ్‌లు తీసుకునేటప్పుడు సిగ్నల్ ఇండికేటర్స్‌ను ఉపయోగించాలని ఆయన సూచించారు.వాటిని పాటిస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చని అమ్రిక్ సింగ్ థిల్లాన్ అభిప్రాయపడ్డారు.