భార్య దారుణ హత్య.. సిక్కు సంతతి వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష, యూకే కోర్టు సంచలన తీర్పు

భార్యను దారుణంగా చంపిన సిక్కు సంతతి వ్యక్తికి యూకే కోర్టు( UK Court ) 15 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.ఈ ఏడాది మేలో తూర్పు లండన్‌లోని తమ ఇంట్లోనే నిందితుడు భార్యను బ్యాట్‌తో కొట్టి చంపాడు.

 79-year-old Sikh Man Who Murdered His Wife In London Jailed For 15 Years Details-TeluguStop.com

నిందితుడిని 79 ఏళ్ల తర్సమే సింగ్‌గా ( Tarsame Singh ) గుర్తించారు.ఇతను తన భార్య మాయాదేవి (77)ని( Maya Devi ) చంపినట్లు నేరాన్ని అంగీకరించడంతో బుధవారం స్నారెస్ బ్రూక్ క్రౌన్ కోర్టు శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.

ఈ ఏడాది మే 2న తూర్పు లండన్‌లోని రోమ్‌ఫోర్డ్ పోలీస్ స్టేషన్‌‌లోకి( Romford police station ) వెళ్లిన తర్సమే సింగ్ తన భార్యను ఇప్పుడే చంపి వస్తున్నానని అక్కడి సిబ్బందికి చెప్పాడు.దీంతో ఉలిక్కిపడ్డ మెట్ పోలీసు అధికారులు( Met Police ) వెంటనే ఎల్మ్ పార్క్‌లోని కౌడ్రే వే లోని అతని ఇంటికి వెళ్లారు.

అక్కడ మాయాదేవి విగత జీవిగా పడివుండగా.దగ్గరలోనే రౌండర్ బ్యాట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కార్పెట్, గోడలపై రక్తపు మరకలు కనిపించాయని పోలీసులు తెలిపారు.మాయాదేవి ఘటనాస్థలంలోనే చనిపోయిందని, పోస్ట్‌మార్టం నివేదికలోనూ తలపై బలమైన గాయమైనట్లుగా తేలినట్లు వారు వెల్లడించారు.

తర్సమే సింగ్‌పై హత్యా నేరం సహా పలు అభియోగాలు మోపి రిమాండ్‌కు తరలించారు.

Telugu London, Jailed, Mark Rogers, Maya Devi, Met, Murdered, Romd, Sikh, Tarsam

దీనిపై మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ మార్క్ రోజర్స్( Mark Rogers ) మాట్లాడుతూ.ఇది విషాదకరమైన ఘటన అన్నారు.తర్సమే చర్య అతని ముగ్గురు పిల్లలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

కన్నతల్లిని ఎవరూ ఇలాంటి పరిస్ధితుల్లో కోల్పోకూడదని ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి మద్ధతుగా వుంటామని రోజర్స్ చెప్పారు.అయితే హత్యకు దారి తీసిన పరిస్ధితులను సింగ్ చెప్పలేదని, కానీ నేరాన్ని అంగీకరించినందుకు సంతోషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Telugu London, Jailed, Mark Rogers, Maya Devi, Met, Murdered, Romd, Sikh, Tarsam

సింగ్ పదవీ విరమణ చేయడానికి ముందు ఏళ్ల తరబడి తన ఇంటికి సమీపంలోని రైన్‌హామ్‌లో భార్యతో పాటు పోస్టాఫీసును నడిపాడు.సింగ్ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.వీరు భారతదేశం నుంచి యూకేకు సుమారు 50 ఏళ్ల క్రితం వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube