ఉధృతంగా గోదావరి వరద కాలేశ్వరం వద్ద 70 గేట్లు ఎత్తివేత..!!

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు.

నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు దాదాపు మూడు రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది.

ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ముందుగానే అధికారులు తరలిస్తున్నారు.హైదరాబాదులో కూడా భారీ వర్షాలు పడుతూ ఉండటంతో జిహెచ్ఎంసి అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటూ.

ప్రజలను కాపాడుతూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు.

Advertisement

పరిస్థితి ఇలా ఉంటే గోదావరి ఉధృతంగా మారడంతో.వరద పెరుగుతూ ఉండటంతో.కాలేశ్వరం ప్రాజెక్టు 75 గేట్లను ఎత్తి దిగువకు 6,10, 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.మరో పక్క పోలవరం ప్రాజెక్టుకు కూడా క్రమంగా వరద పెరుగుతుంది.6,33,474 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు.ఇదే సమయంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.30 అడుగులకు చేరుకుంది.వరద మరింత పెరిగితే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు