తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.92 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.92 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.2018తో పోలిస్తే మూడు శాతం పోలింగ్ తగ్గిందని పేర్కొన్నారు.

 70.92 Percent Polling In Telangana Assembly Elections-TeluguStop.com

2018 వ సంవత్సరంలో మొత్తం 73.37 శాతం పోలింగ్ నమోదు అయిందని వికాస్ రాజ్ తెలిపారు.లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారన్నారు.ఓట్ ఫ్రం హోమ్ మంచి ఫలితాలను ఇచ్చిందన్న సీఈఓ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.హైదరాబాద్ లో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్ నమోదు అయింది.రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు.ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.కాగా ఎల్లుండి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ఆయన తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube