ఒక్కొక్కరి ఖాతాలో 69 వేల రూపాయిలు జమచేసిన..ఎన్నికల సమయం లో శుభవార్త !

ఒకపక్క తెలంగాణ ప్రాంతం లో మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.అందరి ద్రుష్టి ఈ ఎన్నికల మీదనే ఉంది ప్రస్తుతం.

మరో నాలుగు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అసెంబ్లీ మరియు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి.తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫీవర్ మొదలు కాబోతుంది.

ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతని సాధ్యమైనంత వరకు తొలగించుకొని మరోసారి 150 కి పైగా స్థానాల్లో గెలవడానికి వైసీపీ( YCP ) ప్రయత్నిస్తుంది.మరోపక్క టీడీపీ - జనసేన( TDP - Janasena ) పార్టీలు ఉమ్మడి కార్యాచరణ తో జనాల్లోకి వెళ్తున్నాయి.

నారా లోకేష్ ఈ నెల 26 వ తారీఖు నుండి యువగళం పాదయాత్ర ప్రారంభించబోతున్నాడు.మరోపక్క పవన్ కళ్యాణ్ జనసేన కూడా వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) ని తిరిగి ప్రారంభించబోతున్నాడు.

Advertisement
69 Thousand Rupees Deposited In The Account Of Each Perso Good News During The E

ఇలా ఈ రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల సమరం లో వైసీపీ ని గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

69 Thousand Rupees Deposited In The Account Of Each Perso Good News During The E

మరోపక్క ముఖ్యమంత్రి జగన్( jagan ) సాధ్యమైనంత ఓటర్లను సంతృప్తి పరచడానికి స్కీమ్స్ ని మంజూరు చేస్తున్నాడు.రీసెంట్ గా ఆయన ఓఎన్జేసీ పైప్ లైన్ ద్వారా ఉపాధి కోల్పోయిన కాకినాడ మరియు కోనసీమ జిల్లాలకు సంబంధించిన 23,458 మత్స్యకారుల కుటుంబాలకు దాదాపుగా 161 కోట్ల రూపాయిల నిధులను విడుదల చేసాడు.అది కూడా ఆయన మత్స్య కారుల దినోత్సవం రోజు నాడు ఈ గొప్ప కార్యక్రమం ని తలపెట్టడం విశేషం.

పైప్ లైన్ ద్వారా ఉపాధి కోల్పోయిన మత్స్య కారులకు నెలకి 11,500 రూపాయిల చొప్పున ఆరు నెలలకు కలిపి 69000 రూపాయిలు ఒక్కో కుటుంబానికి ఇచ్చాడు.తాడేపల్లి ఆఫీస్ ( Tadepalli Office ) నుండి వర్చువల్ బటన్ నొక్కి జగన్ ఈ నిధులను విడుదల చేసాడట.

ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఈ డబ్బులను తమ ఖాతాల్లో జమచేసినందుకు జగన్ కి కృతఙ్ఞతలు తెలియచేసి హర్షం వ్యక్తం చేసారు మత్స్యకారులు.

69 Thousand Rupees Deposited In The Account Of Each Perso Good News During The E
న్యూస్ రౌండప్ టాప్ 20

కేవలం మత్యకారుల విషయం లో మాత్రమే కాదు, ప్రభుత్వం పట్ల పలు విషయాల్లో అసంతృప్తితో ఉన్న అన్నీ రంగాలకు కూడా ఆయన నిధులను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం.అలా కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి జనాల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతని రూపుమాపేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అంతే కాదు రాజధాని గా పిలవబడుతున్న వైజాగ్ లో కూడా రాబొయ్యే రెండు నెలల్లో కొత్త కంపెనీలను తీసుకొని రాబోతున్నాడని తెలుస్తుంది.

Advertisement

సరిగ్గా ఎన్నికల సమయం లో ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి, జనాలు మన ముఖ్యమంత్రిని నమ్ముతారో లేదో చూడాలి.

తాజా వార్తలు