బిడెన్-శాండర్స్ యూనిటీ టాస్క్‌ఫోర్స్‌లో ఆరుగురు భారతీయ అమెరికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధిగా దూసుకెళ్తున్న జో బిడెన్ తన ప్రచారంలో స్పీడు పెంచారు.

ఈ నేపథ్యంలో ఆయన బిడెన్- శాండర్స్ యూనిటీ టాస్క్‌ఫోర్స్‌ పేరిట ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో ఆరుగురు భారతీయ అమెరికన్ ప్రముఖులకు చోటు కల్పించారు.

ఈ లిస్టులో సీటెల్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్, మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, పర్యావరణ కార్యకర్త వర్షిణీ ప్రకాశ్ (26) ప్రతినిధుల సభ సభ్యురాలు ఒకాసియో కార్టెజ్ (30), పర్యావరణ న్యాయవాది కేథరీన్ ఫ్లవర్స్ (58, సన్‌రైజ్ మూవ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకాశ్‌, మాజీ విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ, లీగల్ లూమినరీ చిరాగ్ బెయిన్స్‌, మాజీ యాక్టింగ్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ వనితా గుప్తా, ప్రముఖ ఆర్ధికవేత్త సోనాల్ షా ఉన్నారు.

77 ఏళ్ల జో బిడెన్‌ను డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ఆగస్టులో విస్కాన్సిన్‌లో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ద్వారా అధికారికంగా నామినేట్ చేయనున్నారు.దీని తర్వాత నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో బిడెన్ పోటీపడనున్నారు.వాతావరణ మార్పులు, క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్, ఎకానమీ, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇమ్మిగ్రేషన్ అనే ఆరు కీలక రంగాలకు అవసరమైన విధాన కార్యక్రమాలను అన్వేషించడానికే బిడెన్, శాండర్స్ ఈ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

అధ్యక్ష ఎన్నికలపై ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం.డొనాల్డ్ ట్రంప్ కంటే జో బిడెన్ 8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు