ఆస్ట్రేలియాలో( Australia ) ఘోర విషాదం చోటు చేసుకుంది.విక్టోరియా రాష్ట్రంలో గస్తీ లేని ఓ బీచ్‌లో నీటిలో మునిగి నలుగురు భారతీయులు మరణించారు.
వీరిలో ఇద్దరు మహిళలు కూడా వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.గడిచిన 20 ఏళ్లలో విక్టోరియా జలాల్లో( Victorian Waters ) చోటు చేసుకున్న అత్యంత ఘోర విషాదం ఇదేనని అధికారులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.విక్టోరియా రాష్ట్రం ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో( Philip Island Beach ) ఈ ఘటన జరిగినట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమీషన్ తెలిపింది.
జనవరి 24న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్‌లో ప్రమాదానికి గురైనట్లు తమకు సమాచారం అందినట్లు విక్టోరియా పోలీసులు వెల్లడించారు.వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశామని, అప్పటికే ఇద్దరు మహిళలు , ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోగా.అపస్మారక స్థితిలో వున్న మరో మహిళను ఆసుపత్రికి తరలించామని అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించినట్లుగా పోలీసులు తెలిపారు.

లైఫ్ సేవింగ్ విక్టోరియా స్టేట్ ఏజెన్సీ కమాండర్ కేన్ ట్రెలోర్( Kane Treloar ) మాట్లాడుతూ.మా పెట్రోలింగ్ లైఫ్‌గార్డ్స్ ఫిలిప్ ద్వీపంలోని ఫారెస్ట్ గుహల వద్ద( Forrest Caves ) నీటిలో మునిగిన నలుగురికి సహాయం చేయడానికి చేరుకున్నారని తెలిపారు.ఘటనాస్థలికి చేరుకున్న తర్వాత.మా లైఫ్‌గార్డులు( Lifeguards ) వారిలో ముగ్గురిని నీటిలోంచి బయటకు తీశారని చెప్పారు.చివరిలో మా రెస్క్యూ బోట్‌లలో ఒకటి నాల్గో వ్యక్తిని బయటకు తీసిందని కేన్ పేర్కొన్నారు.అందరూ అపస్మారక స్ధితిలో వుండటంతో సహాయక బృందాలు వారికి సీపీఆర్ చేశాయని ఆయన వెల్లడించారు.
అయితే బాధితుల పేరు, ఇతర వివరాల పేర్లను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

విక్టోరీయా పోలీస్ ఈస్టర్న్ రీజియన్ అసిస్టెంట్ కమీషనర్, కరెన్ నైహోల్మ్ గురువారం మాట్లాడుతూ.బాధితులు 20 ఏళ్ల లోపున్న ఓ పురుషుడు, ముగ్గురు మహిళలు అని చెప్పారు.మృతుల్లో ఒకరనైన 43 ఏళ్ల మహిళ ఆస్ట్రేలియాలో విహారయాత్రకు వచ్చిందని నైహోల్మ్ పేర్కొన్నారు.
మిగిలిన ముగ్గురు బాధితులు మెల్‌బోర్న్ శివారులోని క్లైడ్‌కు చెందినవారుగా పోలీసులు ధృవీకరించారు.