3డి మోడలింగ్ ఆర్కిటెక్చర్‌... బెస్ట్ కెరీర్ ఆప్షన్లో ఇదొకటి, వివరాలివిగో!

టెక్నాలజీ( Technology ) అనేది నేడు దాదాపు అన్ని రంగాల్లోకి చొచ్చుకు పోయిందని చెప్పుకోవాలి.ఈ క్రమంలో మార్కెట్‌ ట్రెండ్‌కి తగినట్లు స్కిల్స్‌ డెవలప్‌ చేసుకున్న వారికి విశేషమైన అవకాశాలు లభిస్తున్నాయి.

 3d Modeling Architecture This Is One Of The Best Career Options, Here Are The D-TeluguStop.com

ప్రస్తుతం ఇండియాలో కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ది చెందుతోందనే విషయం మీకు తెలుసా? ముఖ్యంగా కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను( Construction projects ) సమర్థవంతంగా రూపొందించగల ఆర్కిటెక్ట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది.నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్‌లకు ఎల్లప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

ఇపుడు మార్కెట్లోకి 3డి మోడలింగ్, సిమ్యులేషన్‌ వంటి కొత్త టెక్నాలజీలు వచ్చాయి.ప్రతి ఆర్కిటెక్చరల్ ఆఫీస్‌కు 3డి యానిమేషన్ ( 3D animation )అవసరం చాలా ఉంటుంది.ఈ నేపథ్యంలో ఆర్కిటెక్చర్‌లో 3డి మోడలింగ్, సిమ్యులేషన్‌ చేసిన వారి కెరీర్‌ అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.భారతదేశంలో 3డి మోడలింగ్, సిమ్యులేషన్‌లో ఆర్కిటెక్ట్‌లకు కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆర్కిటెక్చర్ సంస్థలు, ఇంజనీరింగ్ సంస్థలు, వీడియో గేమ్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, మూవీ ప్రొడక్షన్ స్టూడియోలలో కూడా ఆర్కిటెక్ట్‌లు పని చేయవచ్చు.

ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వారికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.ప్రారంభ స్థాయిలో, 3డి విజువలైజర్‌లు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఇస్తారు.ఒక్కసారి అనుభవం సంపాదించారంటే నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు వరకు సంపాదించే వీలుంది.ఈ రంగంలో ఎక్స్‌పీరియన్స్‌ పెరిగే కొద్దీ ఆర్కిటెక్ట్‌లు 3డి మోడలర్స్‌, మేనేజర్స్‌, ప్రాజెక్ట్ మేనేజర్స్‌, డైరెక్టర్స్‌గా కూడా మారవచ్చు.ఇక 3డి విజువలైజర్ కావడానికి, గ్రాఫిక్ డిజైన్ లేదా ఇంటీరియర్ డిజైన్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ డిగ్రీ చేసి ఉండాలి.

లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube