చాలా మంది భారతీయ యువత అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.ఇదే క్రమంలో యూకేకు వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ఈ క్రమంలో భారతీయ యువతకు తీపి కబురు అందించింది.‘యూకే-ఇండియా యువ నిపుణుల ఒప్పందం’లో భాగంగా గుడ్ న్యూస్ ప్రకటించింది.యువ ప్రొఫెషనల్ పథకం కింద అర్హత ఉన్న భారతీయ యువతకు 2,400 వీసాలు అందించనున్నట్లు తెలిపింది.యుకె ప్రభుత్వం ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది.గత నెలలో అధికారికంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండే భారతీయ పౌరులను రెండు సంవత్సరాలు బ్రిటన్‌లో నివసించడానికి, పనిచేయడానికి వీసా అనుమతిస్తుంది.

న్యూఢిల్లీకి చెందిన బ్రిటిష్ హై కమిషన్ ఈ కొత్త పథకం కోసం గురించి అర్హత ప్రమాణాలను విడుదల చేసింది.ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభం అవుతుంది.మార్చి 2 నాటికి దరఖాస్తు చేయవచ్చు.
భారత పౌరులు 18 – 30 సంవత్సరాల మధ్య ఉండేవారు అర్హులు.దరఖాస్తుదారులకు తగిన విద్యా అర్హత ఉండాలి.
బ్యాచిలర్ డిగ్రీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి.సేవింగ్స్ ఖాతాలో 2,530 పౌండ్లు (సుమారు 2.6 లక్షల రూపాయలు) ఉండాలి.

ఎంపిక చేసిన అభ్యర్థులు వారి వీసా కోసం తరువాత ఆహ్వానంలో ఇచ్చిన కాలపరిమితి వరకు దరఖాస్తు చేసుకోవాలి, ఇది సాధారణంగా 30 రోజుల్లోనే ఉంటుంది.ఎంపికైన అభ్యర్థి తన వీసా కోసం దరఖాస్తు చేసిన ఆరు నెలల్లో బ్రిటన్ వెళ్ళవలసి ఉంటుంది.24 నెలలు UK లో ఉండటానికి, పనిచేయడానికి వీసాలు మంజూరు చేస్తారని అర్హత ప్రమాణాలు సూచిస్తున్నాయి. ఈసారి, వీసా పొందడంలో విఫలమైతే, అర్హత ఉన్నవారికి మరో అవకాశం ఇవ్వబడుతుంది.జూలైలో ఈ అవకాశాన్ని మళ్లీ కల్పిస్తారనే అంచనాలు ఉన్నాయి.







