24 మూవీ రివ్యూ

వరస అట్టర్ ప్లాప్ లతో బాధ పడుతున్న సూర్య తన సికందర్ , రాక్షసుడు సినిమాలతో ప్రొడ్యూసర్ లకి ఇంకా బాకీలు కడుతూ బిజీ గా ఉన్నాడు.

విక్రం కుమార్ తో 75 కోట్ల ప్రాజెక్ట్ కి సంతకం పెట్టడమే కాక తానే ప్రొడ్యూసర్ అవతారం ఎత్తడం తో సూర్య తన లైఫ్ లోనే అతిపెద్ద రిస్క్ తీసుకున్నాడు అని ఖచ్చితంగా చెప్పాలి.

డైరెక్టర్ విక్రం మనం , 13 బీ , ఇష్క్ లాంటి యావరేజ్ నుంచి తక్కువ బడ్జెట్ సినిమాలు హ్యాండిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇన్నేసి కోట్ల బడ్జెట్ సినిమాని అదీ సూర్య లాంటి పెద్ద హీరో ఫార్మ్ కోల్పోయిన సమయం లో అతన్ని ఎలా హ్యాండిల్ చేసాడు అనేది ఆసక్తికరంగా మారిన వేళ ఈ సినిమా రివ్యూ చూద్దాం రండి.

కథ

: శివ కుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్.తన భార్య ప్రియ (నిత్యా మీనన్), నెలల వయసుండే కొడుకుతో కలిసి ఓ ప్రశాంతమైన పరిసరాల్లో జీవిస్తూ, ఓ వాచీని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు.

ఆ వాచీతో కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళే అవకాశం ఉండడమే దాని ప్రత్యేకత.అలాంటి వాచీని తన సొంతం చేసుకోవాలని శివకు కవల సోదరుడైన ఆత్రేయ (సూర్య) ప్రయత్నిస్తూంటాడు.అలాంటి ప్రయత్నాల్లోనే కొన్ని అనూహ్య పరిస్థితుల్లో, శివ, ప్రియ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ వాచీని, తమ కుమారుడిని ఎవరో తెలియని ఓ యువతి (శరణ్య) చెంత చేరుస్తారు.26 ఏళ్ల తరువాత, తల్లి శరణ్యతో సంతోష జీవితం గడిపే మణి (సూర్య)కు తమ వద్ద ఉండే ఆ వాచీ గురించి తెలుస్తుంది.మణికి ఈ వాచీ దొరికిందన్న విషయం కూడా అప్పుడే 26ఏళ్ళు కోమాలో ఉండి బయటకొచ్చిన ఆత్రేయకు కూడా తెలుస్తుంది.

ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వాచీ ఎలా పనిచేస్తుంది? మణి దగ్గర వాచీ ఉందని తెలుసుకున్న ఆత్రేయ అతడ్ని ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.

పాజిటివ్ లు:

ఈ సినిమాకి ఊపిరి గా నిలిచాడు హీరో సూర్య.కథ - కథనం శరీరం అయితే మూడు పాత్రలకీ సమాన న్యాయం చేస్తూ ఈ దేశం లో కమల్ తరవాత అత్యంత ఉన్నతమైన యాక్టర్ గా సూర్య మళ్ళీ ప్రశంసలు అందుకో బోతున్నాడు.

Advertisement

డైరెక్టర్ గా విక్రం ఎక్కడ పట్టు కోల్పోయినా తన చరిష్మా తో సూర్య ప్రేక్షకులని కట్టి పారేసాడు .ప్రతీ క్యారెక్టర్ నీ పండిస్తూ ఒక విదేశీ వ్యక్తి ఈ సినిమా చూస్తే మూడు పాత్రలూ సూర్య నే చేసాడు అంటే నమ్మశక్యం కాని విధంగా తన పెర్ఫెక్షన్ ని చూపించాడు ఇతను.

డైరెక్టర్ రాసుకున్న అద్భుతమైన కథ కి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసింది.తిర్రు ఇచ్చిన ఈ కెమెరా విజువల్స్ కచ్చితంగా మంచి అవార్డ్ ని పొంది తీరతాయి అనచ్చు .విక్రం తన పెన్ పదును మరొక సారి రుచి చూపించాడు.సహజం గా ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కి స్క్రీన్ ప్లే అత్యంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ విక్రం లోని స్పెషాలిటీ మళ్ళీ చూపిస్తూ 24 సినిమా ఒక చందమామ కథ లాగా సాగుతుంది.

నటన లో ఎవరి పరిథి లో వారు చేసారు .ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకి అతిపెద్ద హై లైట్ గా చెప్పాలి .కామెడీ కూడా బాగానే పండింది .

నెగెటివ్ లు:

క్లిమాక్స్ కాస్త బోరింగ్ అనిపించినా డైరెక్టర్ కి అంతకు మించి యాడ్ చెయ్యడానికి ఏమీ కనపడదు అనేది ఒప్పుకోవాల్సిన విషయం.రహమాన్ అందించిన పాటలు, వాటి చిత్రీకరణా రెండూ బాగున్నా కూడా కథా గమనంలో ఆ పాటలు రావడం బాగోలేదు.

అదేవిధంగా ఫస్టాఫ్‌లో వాచీ పనిచేసే అంశాన్ని ఎక్కువసార్లు చూపించినట్లు అనిపించింది.ఇక కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళడం సాధ్యమా? ఈ ఆలోచన చుట్టూ పరిస్థితులు ఎలా మారిపోతాయి? ఇలాంటి ప్రశ్నలేవీ లేకుండా ఈ సినిమాను చూడలేని వారికి సినిమా నచ్చకపోవచ్చు.

మొత్తంగా చూస్తే :

కొత్త కథలని పరిచయం చేసే ఒక డైరెక్టర్ - నటన లో కొత్త అంశాలని మేళవించే ఒక హీరో ల నుంచి ఒచ్చిన ఒక అద్భుతంగా 24 సినిమా గురించి చెప్పచ్చు.ఇండియన్ సినిమా పరిస్థితులని జోడిస్తూ ఒక సై ఫై సినిమాని ఇంత అద్భుతంగా తీయడం అనేది విక్రం కి మాత్రమె సాధ్యం అని నిరూపించాడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
2025 లో మన స్టార్ హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారా..?

సూర్య + విక్రం ల కలయిక లో మరొక సినిమా ఖచ్చితంగా రావాలి అని కోరుకునేంత బలంగా ఈ సినిమా సాగుతుంది.రొటీన్ తలనొప్పి జెన్రీ లని తల దన్నేస్తూ 24 ఒక మ్యాజిక్ ని సృష్టిస్తుంది .ఫామిలీ తో వారాంతం హ్యాపీగా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది

రేటింగ్ : 3.5/5

Advertisement

తాజా వార్తలు